భారత్ లో 29 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయించలేదు: అంతర్జాతీయ ఆరోగ్య నివేదిక

Last Updated : Oct 29, 2017, 12:24 PM IST
భారత్ లో 29 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయించలేదు: అంతర్జాతీయ ఆరోగ్య నివేదిక

భారతదేశంలో సుమారు 29 లక్షల మంది పిల్లలకు తట్టు/ పొంగు లేదా మీజిల్స్ వ్యాధి నిరోధక టీకాలు వేయిచలేదని తాజాగా అంతర్జాతీయ ఆరోగ్య నివేదిక ప్రకటించింది. ప్రపంచంలో చాలా దేశాల్లో దాదాపు 2.08 కోట్ల మంది పిల్లలకు తొలిదశ టీకాలు వేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. భారత్ తో సహా నైజీరియాలో అత్యధికంగా 33 లక్షలు, పాకిస్థాన్ లో 20 లక్షలు, ఇండోనేషియాలో 12 లక్షలు, ఇథియోపియాలో 9 లక్షలు, కాంగోలో 7 లక్షల మంది పిల్లలకు వాక్సిన్ వేయించలేదు. 

తట్టు అంటువ్యాధి. శ్వాస, తుంపర్ల ద్వారా త్వరగా వ్యాప్తి చెందుతుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో జబ్బు ఎక్కువగా ప్రబలుతోంది. ఏటా తట్టు జబ్బు ద్వారా వేలాదిమంది చనిపోతారు. కనుక ఈ అంటువ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతిక్కరికీ వాక్సిన్ వేయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వ్యాధి ద్వారా గతేడాది 2016లో 90 వేల మంది చనిపోయారని అంచనా.  ఏటా కేవలం 13 లక్షల మంది పిల్లలను టీకాల ద్వారా రక్షించగలుగుతున్నామని.. అందరూ సహకరిస్తే తట్టు రహిత ప్రపంచాన్ని చూడగలమని ఆశాభావం వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్‌ఓ, ఐరాస తదితర సంస్థలు ఈ నివేదికను రూపొందించాయి.

Trending News