Beauty Tips: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మన ఆరోగ్యంతో పాటు చర్మాన్ని ఎండల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవిలో చెమటలు పట్టడం వల్ల చర్మంపై ఎక్కువ చికాకు ఏర్పడుతుంది. దీంతో చర్మంపై మచ్చలు, మొటిమలు ఏర్పడతాయి. అలాగే జిడ్డు చర్మం ఉన్నవారికి వేసవిలో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాంటి వారి చర్మంపై ఎరుపు మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
ఈ సమస్యలను నివారించేందుకు మార్కెట్లో అనేక సౌందర్య ఉత్పత్తులు దొరుకుతున్నాయి. కానీ, ఎండల నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు కొన్ని నేచురల్ టిప్స్ ను తెలుసుకుందాం.
తులసి-పుదీనాతో ఐస్ క్యూబ్
వేసవిలో చర్మంపై ఐస్ క్యూబ్స్ మసాజ్ చేయడం వల్ల మేలు జరుగుతుంది. దీని వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా పుదీనా, తులసితో చేసిన ఐస్ క్యూబ్స్ తో చర్మంపై సున్నితంగా మర్దన చేయడం వల్ల ప్రయోజనకరం.
ఐస్ క్యూబ్ తయారీకి కావలసిన పదార్థాలు
1) తులసి ఆకులు
2) పుదీనా ఆకులు
3) పన్నీర్
4) నీటి
ఐస్ క్యూబ్ ఎలా తయారు చేయాలి?
ఒక కప్పు నీటిని తీసుకుని అందులో 6-7 తులసి దళాలు లేదా 6-7 పుదీనా ఆకులను నానబెట్టండి. కొద్దిసేపటి తర్వాత వాటిని బాగా కడిగి ఆకులను బాగా దంచాలి. మీకు కావాలంటే వాటిని పేస్ట్‌లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు తరిగిన ఆకులను 1 కప్పు నీటిలో వేసి మరిగించాలి. ఆ మిశ్రమాన్ని కొద్దిసేపు మరిగించిన తర్వాత అది చల్లారాక రోజ్ వాటర్ కలిపి ఫ్రిజ్ లోని ఐస్ ట్రేలో పోయాలి. ఆ మిశ్రమం గడ్డకట్టిన తర్వాత చర్మంపై మసాజ్ చేయాలి.
ఐస్ క్యూబ్ ఎలా ఉపయోగించాలి?
ఆ ఐస్ క్యూబ్ ను తీసుకొని ముఖంపై వృత్తాకారంగా మసాజ్ చేసుకోవాలి. ఒకవేళ మీ స్కిన్ సున్నితంగా ఉంటే.. ఓ క్లాత్ లో లేదా కాటన్ సహాయంతో మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా ఉండడంతో పాటు ముఖంపై దుమ్ము, ధూళి తొలగిపోతాయి. ముఖంపై రంధ్రాలు తెరుచుకుంటాయి.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొందరు నిపుణుల సలహాలు, సూచనలు ద్వారా గ్రహించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని ZEE తెలుగు NEWS ధ్రువీకరించడం లేదు.)
Also Read: Summer Health Tips: వేసవిలో ఈ హెల్త్ టిప్స్ పాటించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు!
Also Read: Watermelon Seeds Benefits: పుచ్చకాయ విత్తనాలను పడేస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.