Brown Rice : బ్రౌన్‌ రైస్‌తో బరువు తగ్గడంతో పాటు బోలెడన్నీ లాభాలు

Reasons Why Switching to Brown Rice  : బ్రౌన్‌రైస్‌లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ స్థాయిలు తక్కువగా ఉంటాయి. కాబట్టి తిన్న తరవాత చాలా ఆలస్యంగా జీర్ణమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2021, 11:49 AM IST
  • వైట్ రైస్‌తో బరువు పెరిగే అవకాశం
  • బ్రౌన్‌రైస్‌తో ఎన్నో ఉపయోగాలు
  • బరువును అదుపులో ఉంచడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు
 Brown Rice : బ్రౌన్‌ రైస్‌తో బరువు తగ్గడంతో పాటు బోలెడన్నీ లాభాలు

Brown Rice Health Benefits Nutrition Facts: రోజూ వైట్ రైస్‌ తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. షుగర్‌ (Diabetes) కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు పలు రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవ్వవచ్చు. అయితే ఇందుకు పరిష్కారంగా బ్రౌన్‌ రైస్‌ (Brown Rice) తీసుకోవచ్చు. దోంతో బరువు తగ్గడంతో (weight loss) పాటు బోలెడన్నీ ప్రయోజనాలుంటాయి. 

బ్రౌన్‌రైస్‌లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె కవాటాలు మూసుకుపోకుండా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ (bad cholesterol) తగ్గి బరువు అదుపులో ఉంచడానికి బ్రౌన్‌రైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 

బ్రౌన్‌రైస్‌లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ స్థాయిలు తక్కువగా ఉంటాయి. కాబట్టి తిన్న తరవాత చాలా ఆలస్యంగా జీర్ణమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బ్రౌన్‌రైస్ అధిక మొత్తంలో ఉండే ఫైబర్లు కేన్సర్‌కు కారణమయ్యే విషతుల్యాలను శరీరం నుంచి బయటకు పంపుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోజూ శరీరానికి అందడం వల్ల పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లు (cancer) వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.

బ్రౌన్‌రైస్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఇవి శరీరంలో పేరుకున్న ఫ్రీ రాడికల్స్‌ని, వ్యర్థాలనూ బయటకు పంపిస్తాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి (Skin) ఎంతో మేలు చేస్తాయి. నిత్యం యవ్వనంగా కనిపించేందుకు ఇవి దోహదపడతాయి.

Also Read : Telangana weather updates: తెలంగాణకు నేడు భారీ వర్షసూచన

బ్రౌన్‌రైస్‌లో ఉండే మెగ్నీషియం, కాల్షియం వల్ల ఎముకలు(Bones) కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కప్పు బ్రౌన్‌రైస్‌ ద్వారా 21 శాతం మెగ్నీషియం శరీరానికి అందుతుంది. బ్రౌన్‌రైస్‌ రోజూ తీసుకుంటే మతిమరుపు, అల్జీమర్స్, డిమోన్షియా లాంటి వ్యాధులకు కూడా దూరంగా ఉండవచ్చు. 

పోష‌కాల ప‌రంగా చూస్తే వైట్ రైస్ (White Rice) క‌ంటే బ్రౌన్ రైస్‌లోనే అధిక పోషకాలుంటాయి. ముఖ్యంగా బ్రౌన్ రైస్‌లో (Brown Rice) ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మిన‌రల్స్ కూడా అధికంగా ఉంటాయి. అయితే వైట్ రైస్‌లో ఈ పోష‌కాలు ఉండ‌వు.

Also Read : ZEEL, Sony merger: జీల్, సోనీ విలీనంపై కీలక ప్రకటన.. మీడియా ప్రపంచంలో కీలక పరిణామం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News