Smoking Threats: ఈ వీడియో చూస్తే ఇక జీవితంలో స్మోక్ చేయరు, ఇంతలా ఉంటుందా

Smoking Threats: పొగాకు ఆరోగ్యానికి హానికరం. అందరికీ తెలిసిందే. అయినా వదిలిపెట్టరు. వరల్డ్ నో టొబాకో డే జరుపుకుంటున్నా సిగరెట్ తాగడం మాత్రం మానరు. ఊపిరితిత్తులు నాశనమౌతున్నా..సిగెరట్ పొగ లోపలకు వెళ్తూనే ఉంటుంది. అసలు సిగరెట్లు మీ ఊపిరితిత్తుల్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తాయో తెలుసా...ఈ వీడియో చూడండి

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 31, 2024, 07:56 PM IST
Smoking Threats: ఈ వీడియో చూస్తే ఇక జీవితంలో స్మోక్ చేయరు, ఇంతలా ఉంటుందా

Smoking Threats: ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 80 లక్షలకంటే ఎక్కువమంది పాగాకు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో 10 లక్షలమంది ప్రాణాలు కేవలం పాసివ్ స్మోకింగ్ కారణంగా పోతున్నాయి. అంటే సిగరెట్ ఎంత ప్రమాదకరమైందో తెలుసుకోండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మళ్లీ జీవితంలో సిగరెట్ ముట్టకపోవచ్చు.

ధూమపానం, టొబాకో పర్యవసానాలపై ప్రజల్ని చైతన్య పర్చేందుకే ప్రతి యేటా మే 31న వరల్డ్ నో టొబాకో డే జరుపుకుంటుంటాము. పొగాకు కారణంగా ఎదురయ్యే ముప్పు, ఇతర నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలు చాలా సంస్థలు, ప్రభుత్వాలు తీసుకుంటూనే ఉంటాయి. కానీ సిగరెట్, టొబాకో విక్రయాలు మాత్రం నిషేధించరు. ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకుపైగా ప్రతి యేటా టొబాకో కారణంగా మరణిస్తున్నారు. వీరిలో 10 లక్షలమంది అయితే స్వయంగా సిగరెట్ తాగరు కానీ సిగరెట్ తాగేవారి పక్కనుండి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. 

ధూమపానం ఊపిరితిత్తుల్ని ఎలా పాడు చేస్తుంది

పొగాకు పొగలో 700కు పైగా హానికారక రసాయనాలుంటాయి. ఇందులో చాలావరకూ కేన్సరక్ కారకాలే. స్మోకింగ్ చేయడం వల్ల ఈ రసాయనాలు ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లో చేరుతాయి. అక్కడ ఆక్సిజన్ వర్సెస్ కార్బన్ డై ఆక్సైడ్ శ్వాస నిశ్వాసల్లో ఆటంకం కల్గిస్తాయి. క్రమక్రమంగా గాలి సంచులు దెబ్బతింటాయి. కుంచించుకుపోతాయి. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ఆ తరువాత క్రానిక్ బ్రోంకైటిస్ వంటి సీరియస్ శ్వాస వ్యాధులకు దారితీస్తుంది. ఇది జీవితంలో ముప్పుకు కారణమౌతుంది.

ఆరోగ్యమైన ఊపిరితిత్తులు ఎప్పుడూ గులాబీ రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆక్సిజన్ పీల్చుతూ కార్బన్ డై ఆక్సైడ్ వదిలే ప్రక్రియ సక్రమంగా ఉంటుంది. ఇది ధూమపానం చేయనివారి పరిస్థితి. అదే ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తులు నల్లగా, కుదించుకుపోయుంటాయి. గాలి సంచులు దెబ్బతినుంటాయి. అందులో కఫం పేరుకుపోయి ఉంటుంది. ఊపిరితిత్తుల సామర్ధ్యం తగ్గిపోతుంది. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. దగ్గు, అలసట వంటి వ్యాధులు తలెత్తుతాయి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు సిగరెట్ ప్రభావం ఎలా ఉంటుందో చక్కగా అర్ధమౌతుంది. మళ్లీ జీవితంలో సిగరెట్ ముట్టరు.

స్మోకింగ్ మానేసినప్పుడు దెబ్బతిన్న ఊపిరితిత్తులు క్రమంగా ఆరోగ్యంగా మారడం ప్రారంభమౌతుంది. శ్వాసలో మార్పు కన్పిస్తుంది. ఫ్రీగా శ్వాస పీల్చుకోగలుగుతారు. అలసట తగ్గుతుంది. కొత్త శక్తి లభిస్తుంది. గుండె వ్యాధులు ఇతర సమస్యలు తగ్గుతాయి. అందుకే సిగరెట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మానండి. క్రమక్రమంగా సిగరెట్ స్మోకింగ్ తగ్గించడం అనేది ఒట్టిమాట. దీనిని అస్సలు నమ్మవద్దు. సిగరెట్ పూర్తిగా ఒకేసారి మానేయాలి. మానలేకుంటే మంచి వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. 

Also read: Cholesterol Tips: కిచెన్‌లో ఉండే ఈ రెండు పదార్ధాలు చిటికెడు తీసుకుంటే చాలు కొలెస్ట్రాల్ మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News