Rotis For Diabetics: శరీరం ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండడానికి ప్రతిరోజు పోషకాలు కలిగిన ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. అంతేకాకుండా తీసుకునే ఆహార పద్ధతులు కూడా శరీర ఆరోగ్యంపై ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే వైద్యులు ఉదయం పూట అల్పాహారం లో భాగంగా లైట్ ఫుడ్స్ మధ్యాహ్నం రైస్ లాంటి ఆహారాలను తీసుకోవాలని సూచిస్తారు. ముఖ్యంగా రాత్రిపూట రోటీలను తీసుకోవడం మంచిదని వారు చెబుతున్నారు. మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు మధ్యాహ్నం లంచ్‌తో పాటు రాత్రి డిన్నర్‌లో కూడా చపాతీలు తీసుకోవడం ఎంతో మంచిది అని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు తాజాగా తయారు చేసుకున్న రోటీలకు బదులుగా ఒక రోజు ముందు తయారు చేసుకున్న రోటీలను తీసుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని వారు అంటున్నారు. ఇంతకీ ఇలా ఒక రోజు ముందు రోటీలను తినడం మంచిదేనా? ఇలా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లైసెమిక్ సూచిక :
ఒక రోజు ముందు రోటీలలో గ్లైసెమిక్ సూచిక తాజాగా చేసిన వాటికంటే తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కార్బోహైడ్రేట్లలో కూడా అనేక మార్పులు వస్తాయి. మధుమేహం ఉన్నవారు ఇలా రోటీలను తీసుకోవడం వల్ల రక్తప్రవాహంలోకి గ్లూకోజ్ విడుదలను నెమ్మదిస్తుంది. దీంతోపాటు రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవాలనుకునేవారు ప్రతిరోజు ఒకరోజు ముందు తయారుచేసిన రోటీలను మాత్రమే తీసుకోవాలి.
Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
ఒక రోజు ముందు తయారు చేసిన రోటీల్లో తక్కువ గ్లూటెన్ కంటెంట్ లభిస్తుంది.. కాబట్టి వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా రాకుండా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట నొప్పి, మలబద్ధకం, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు ఒక రోజు ముందు చేసిన రొట్టెలను తీసుకోవడం చాలా మంచిది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter