Groundnut And Jaggery Uses: పల్లీ బెల్లం తింటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

Jaggery And Peanuts Benefits: మన శరీరం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే శక్తిని పెంచే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. శరీరానికి కావాలసిన ప్రొటీన్‌, ఫాస్పరస్‌, థైమీన్, లాంటి పోషకాలను ఎంతో అవసరం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ పోషకాలు మన శరీరానికి అందుతాయి. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2024, 01:35 PM IST
Groundnut And Jaggery Uses: పల్లీ బెల్లం తింటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

Jaggery And Peanuts Benefits: శరీరం ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా శరీరానికి కావాలసిన పోషకాలు, విటమిన్‌లు తీసుకోవడం చాలా అవసరం. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్యినిపుణులు చెబుతున్నారు. వేరుశనగలు, బెల్లం వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యనికి కావాలసిన పోషకాలు దొరుకుతాయి అని నిపుణులు చెబుతున్నారు.

వేరుశనగలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో అధికశాతం మంచి కొవ్వు ఎక్కువగా లభిస్తుంది. ఆరోగ్యనిపుణుల ప్రకారం పల్లీలో ప్రోటిన్ శాతం గుడ్లలు, మాంసంలోకన్నా ఎక్కువగా ఉంటుంది.

 దీనిని పిల్లలు, పెద్దలు, పాలిచ్చే తల్లులు తీసుకోవడం వల్ల మంచి కలుగుతుంది. పచ్చి పల్లిలు తినడం కష్టంగా ఉంటే వాటిని లడ్డూల చేసి కూడా తినవచ్చు.  అంతేకాకుండా వేయించిన గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

Also read: Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలను పాటించండి!

అంతేకాకుండా తరుచు మహిళలు నెలసరి సమయంలో కడుపునొప్పి సమస్యతో బాధపడుతుంటూ ఉంటారు. అయితే నానబెట్టి పల్లీలు, బెల్లంతో కలిపి తీసుకుంటే ఐరన్‌ లభిస్తుంది. దీని వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

ఈ విధంగా పల్లీలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి  ఎంతో  మేలు జరుగుతుందని ఆరోగ్యనిపుణులు  చెబుతున్నారు. 

Also read: Foods To Avoid For Healthy Heart: ఈ ఆహార పదార్థాలు తీసుకుంటున్నారా? మీ గుండె జాగ్రత్త మరి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News