Fenugreek Seeds Tea For Diabetes: మన వంట గదిలో లభించే పోపు దినుసుల్లో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. ఇక మెంతి గింజల గురించి చెప్పనక్కర్లేదు ఎందుకంటే వీటిని ఆయుర్వేద శాస్త్రంలో గొప్ప ఔషధంగా పరిగణిస్తారు. ప్రతిరోజు మనం వీటిని వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీటిని చాలామంది జుట్టుకు కూడా వినియోగిస్తారు. దీనిని వినియోగించడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది నోటికి రుచిగా లేకపోయినా శరీరానికి చలువ చేయడమే కాకుండా.. మధుమేహంతో బాధపడే వారికి ఔషధం కంటే ఎక్కువగా పని చేస్తాయి.
చిన్న వయసులోనే మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలను కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామందిలో తరచుగా రక్తంలోని చక్కెర పరిమాణాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలాంటివారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన మెంతుల టీ ని తాగాల్సి ఉంటుంది. ఈ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు తాగితే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!
మెంతి గింజలతో తయారు చేసిన టీ ని ప్రతిరోజు తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గడమే కాకుండా జీర్ణ క్రియ సమస్యలన్నీ దూరం అవుతాయి. ముఖ్యంగా మలబద్ధకం, పొట్టనొప్పి, ఉబ్బరం వంటి సమస్యలకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యలను కూడా సులభంగా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు, శరీరంలోని కొలెస్ట్రాల్ ను నియంత్రించాలనుకునేవారు తప్పకుండా మెంతి గింజల టీ ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
మెంతి గింజల టీ తయారు చేసుకోవడానికి ముందుగా రెండు చెంచాల మెంతి గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పై చిన్న కప్పు పెట్టుకొని అందులో రెండు గ్లాసుల నీటిని పోసుకోవాలి. ఇందులోనే రెండు చెంచాల మెంతులను కూడా పోసుకొని బాగా మరిగించాలి ఇలా మరిగించిన తర్వాత స్టవ్ పై నుంచి దింపి.. ఫిల్టర్ చేసుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ టీని తాగాల్సి ఉంటుంది.
చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.