Good Eye vision: కంటిచూపును కాపాడే 9 ఆహారాలు.. మీ డైట్లో తప్పక ఉండాలి మరి..

Foods For Good Eye vision:  పాలకూరలో లుటీన్, జియాన్తీన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి హానికర అల్ట్రా వైలెట్ రేస్ నుంచి కంటిని కాపాడతాయి. 

Written by - Renuka Godugu | Last Updated : Aug 2, 2024, 07:01 AM IST
Good Eye vision: కంటిచూపును కాపాడే 9 ఆహారాలు.. మీ డైట్లో తప్పక ఉండాలి మరి..

Foods For Good Eye vision: కంటిచూపు మెరుగ్గా ఉండాలని అందరికీ ఉంటుంది. అయితే కళ్లు ఆరోగ్యంగా ఉండటం లైఫ్ లో ఎంతో ముఖ్యం. దీనికి సమతుల ఆహారం తీసుకోవాలని ముఖ్యంగా పోషకాలు, ఖనిజాల పుష్కలంగా ఉండే ఆహారాలు కంటి చూపుకు ఎంతో అవసరం ముఖ్యంగా క్యాటరాక్ట్‌ డిజనరేషన్ సమస్యల నుంచి బయటపడాలంటే 9 రకాల ఆహారాలు కంటిచూపును కాపాడుతాయి అవి ఏంటో తెలుసుకుందాం.

క్యారెట్లు..
క్యారెట్లు అంటేనే కంటి చూపుకి ఎంతో ఆరోగ్య కరం. ఇందులో ముఖ్యంగా బీటా కెరొటిన్, విటమిన్ ఏ ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైన కంటి చూపునకు ఎంతో అవసరం. ముఖ్యంగా ఇందులో ఉండే బీటా కెరొటిన్, రెటీనా ఇతర కంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది.

పాలకూర..
పాలకూరలో లుటీన్, జియాన్తీన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి హానికర అల్ట్రా వైలెట్ రేస్ నుంచి కంటిని కాపాడతాయి. అంతేకాదు ఈ రెండు కంటి చూపులు మెరుగు చేస్తాయి రెటీనా డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

బంగాళదుంపలు..
బంగాళదుంపలు కూడా కంటిచూపుకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇందులో కూడా బీటా కెరోటీన్‌ ఉంటుంది. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్ కంటిచూపును కాపాడుతాయి, ఆక్సిడేటివ్‌ డ్యామేజ్‌ కాకుండా నివారిస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం బంగాళదుంపలు క్యాటరాక్ట్ డ్యామేజ్ కాకుండా నివారిస్తాయి.

గుడ్లు..
గుడ్లలో కూడా లూటీన్‌, గ్జియాన్తీన్‌ విటమిన్ ఏ, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్నీ కంటి చూపుకు ఎంతో అవసరం. కొన్ని నివేదికల ప్రకారం వయసు రీత్యా వచ్చే కంటి సమస్యలకు ఇవి చెక్ పెడతాయి.

చేప..
ఫ్యాట్‌ పుష్కలంగా ఉండే చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపుకి ఎంతో ముఖ్యం ఒమేగా 3s కళ్ళు పొడిబారకుండా కాపాడుతుంది. అంతేకాదు ఇది గ్లకోమా వ్యాధి బారిన పడకుండా కాపాడుతుందని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. రెటినా కణాలను ఈ ఫ్యాటీ ఫిష్ కాపాడుతుంది.

ఇదీ చదవండి: బియ్యంపిండితో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోండి..

బాదం..
బాదం లో కూడా విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా కంటి ఆరోగ్యానికి కాపాడుతుంది ఆక్సిడెంట్ కాకుండా నివారిస్తుంది. వయసు రిత్యా వచ్చే సమస్యలను కూడా నివారిస్తుందని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ క్యాటరాక్ట్‌ సమస్యల నుంచి బయట పడేస్తాయి.

ఆరెంజ్..
ముఖ్యంగా ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో అంటే ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి కాబట్టి ఇది కంటిని డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. నివేదికల ప్రకారం విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే కంటి సమస్యలకు దూరంగా ఉంటారు.

బెల్ పెప్పర్..
బెల్ పెప్పర్ లో కూడా విటమిన్ జియాన్తీన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు చేస్తాయి. కార్నియా సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుందని బ్రిటిష్ జనరల్ న్యూట్రిషన్ తెలిపింది డైట్ లో విటమిన్ ఏ విటమిన్ సి ఉండే ఆహారాలు తప్పకుండా చేర్చుకోవాలి.

ఇదీ చదవండి: వర్షా కాలంలో ఈ ఆహారాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

బ్లూబెర్రీస్..
బ్లూబెర్రీస్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అంతే కాదు ఇందులో విటమిన్ సి విటమిన్ బీటా కెరటిన్ ఉంటుంది. ఈ ఖనిజాలు వాపు సమస్యను తగ్గించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని నివారిస్తాయి. రెటీనా ఆరోగ్యానికి బ్లూబెర్రీస్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇది వయస్సురీత్యా వచ్చే కంటి సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతాయని నివేదికలో తేలింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News