Gut Health: కడుపు ఆరోగ్యాన్ని పాడు చేసే 8 ఆహారాలు.. కచ్చితంగా వీటికి దూరంగా ఉండాల్సిందే..

Foods Spoils Gut Health: రెడ్ మీట్‌లో ప్రోటీన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కడుపు ఆరోగ్య పనితీరుకు అడ్డుగా మారుతుంది. దీంతో మంట సమస్య వస్తుంది. ఇది కోలోన్ క్యాన్సర్ కి కారణమవుతుంది. రెడ్ మీట్ తీసుకునే బదులు ప్రోటీన్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంటే పౌల్ట్రీ గుడ్లు, ఫిష్ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.

Written by - Renuka Godugu | Last Updated : Jul 5, 2024, 06:57 AM IST
Gut Health: కడుపు ఆరోగ్యాన్ని పాడు చేసే 8 ఆహారాలు.. కచ్చితంగా వీటికి దూరంగా ఉండాల్సిందే..

Foods Spoils Gut Health: కడుపు ఆరోగ్యానికి అనేక చర్యలు తీసుకుంటాం. ఇది ఇలా ఉంటేనే శరీరారోగ్యం బాగుంటుంది. అజీర్తి సమస్యతో బాధపడుతుంటే అది మెంటల్ హెల్త్ పై కూడా ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉంటేనే కడుపు ఆరోగ్యం బాగుంటుంది అలాంటి 8 ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

ప్రాసెస్ ఫుడ్స్..
ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అనారోగ్యకరమైన కొవ్వులు, ప్రాణానికి హాని కలిగించే ఆహార పదార్థాలు వేసి తయారుచేస్తారు. ఇది కడుపు ఆరోగ్యాన్ని దయనీయంగా మారుస్తుంది. దీంతో కడుపు సమస్యలు, మంట వస్తాయి. ముఖ్యంగా ఫ్రోజెన్ ఫుడ్స్, స్నాక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

రిఫైన్ షుగర్..
రిఫైన్ చేసిన చక్కెర కూడా దూరంగా ఉండాలి. ఇది కడుపు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. దీంతో మంట సమస్య వస్తుంది అజీర్తి సమస్య కూడా మొదలవుతుంది. చక్కెర కలిగిన క్యాండీ, సోడా, పేస్ట్రీలకు దూరంగా ఉండాలి. లేకపోతే మీ కడుపు ఆరోగ్యం కుంటుపడుతుంది.

ఫ్రైడ్ ఫుడ్స్..
ముఖ్యంగా వేయించిన ఆహారాలు రుచికరంగా ఉంటాయని వీటిని అతిగా తింటాం. ఇందులో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మీ కడుపు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వేయించిన ఆహారాలకు చాలా దూరం ఉండాలి. ఇది మంట సమస్యలను కలిగిస్తుంది. కడుపు ఆరోగ్య పని తీరును కుంటుపడేలా చేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతాయి.

రెడ్ మీట్..
రెడ్ మీట్‌లో ప్రోటీన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కడుపు ఆరోగ్య పనితీరుకు అడ్డుగా మారుతుంది. దీంతో మంట సమస్య వస్తుంది. ఇది కోలోన్ క్యాన్సర్ కి కారణమవుతుంది. రెడ్ మీట్ తీసుకునే బదులు ప్రోటీన్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంటే పౌల్ట్రీ గుడ్లు, ఫిష్ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.

ఇదీ చదవండి: వారానికి ఒక్కసారైనా ఈ కూరగాయ తినండి.. మీ గుండె ఉక్కులా మారుతుంది..

ఆర్టిఫిషియల్ స్వీటెనర్‌..
ఆర్టిఫిషియల్ స్వీటెనర్‌ అనగానే చక్కర బదులుగా తీసుకుంటారు. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయని అనుకుంటారు. కానీ ఇది కడుపు ఆరోగ్య పనితీరును దెబ్బతీస్తుంది. ఆర్టిఫిషియల్ స్వీటెనర్‌ లో కడుపు సంబంధిత సమస్యలు మొదలవుతాయి. దీనికి బదులుగా తేనె వంటివి చేసుకోవాలి.

ఆల్కహాల్..
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా కడుపులో సమస్యలు మొదలవుతాయి. కడుపు సమస్యలు ఇమ్యూనిటీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం బదులు నీరు, హెర్బల్‌ టీ, కంబుచా వంటివి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.

ఇదీ చదవండి: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్టేజ్‌- 3 అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్సలు ఏముంటాయి..?

కెఫీన్..
కాఫీలు వంటివి ఒక స్థాయిలో తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే ఇది కూడా జీర్ణ సమస్యలను ప్రేరేపిస్తుంది. యాసిడ్ రీఫ్లెక్స్, గుండె మంటకు దారితీస్తుంది. సమతుల ఆహారం తీసుకోవడం వల్ల కడుపు ఆరోగ్యం కూడా బాగుంటుంది.

కార్న్‌ సిరప్..
ఫ్రక్టోజ్ అధిక మోతాదులో ఉండే కార్న్‌ సిరప్ కూడా కడుపు ఆరోగ్య పరిస్థితిని దెబ్బతీస్తుంది మంట సమస్యలను వస్తుంది. ఫ్రక్టోజ్‌ లేని ఆహారాలను వాటి లెబుల్‌పై చదివి మరీ తీసుకోండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News