Sabja Seeds For Gastritis And Cholesterol: పొట్ట బాగుంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే చాలా మంది ప్రస్తుతం అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చల విడిగా తీసుకుంటున్నారు. దీని కారణంగా కడుపులో గ్యాస్, చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే పొట్టలో గ్యాస్ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎలాంటి రసాయనాలు లేని కొన్ని హోం రెమెడీని వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్యాస్ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సబ్జా గింజలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే వీటిని రోజూ ఆహారంలో ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కడుపులో గ్యాస్ తగ్గించుకోవడానికి గింజలతో ఔషధం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
ఇలా వినియోగించవచ్చు:
ఈ ఔషధాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా 1 స్పూన్ సబ్జా గింజలు, 1 గ్లాసు గోరువెచ్చని నీరు, 3-4 పుదీనా ఆకులను తీసుకోవాలి. ఇప్పుడు ఆ గింజలను, పుదీనా ఆకులను గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ నీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. తక్షణమే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎలా ఉపశమనం లభిస్తుంది:
తులసి గింజలనే చాలా మంది సబ్జా గింజలు అని అంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే కడుపులో గ్యాస్, గుండెల్లో మంట నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
పొట్టను శుభ్రపరుచుతుంది:
తులసి గింజల రసం పొట్టను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. దీనిని డిటాక్స్ డ్రింక్ లా కూడా వినియోగించ వచ్చు.. ఇలా క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల కడుపులో మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇది కడుపులో గ్యాస్, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
మలబద్ధకం:
చాలా మంది మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సబ్జా గింజలను ఆహారంలో భాగంగా చేర్చుకోండి. కేవలం 1 టీస్పూన్ సబ్జా గింజలు ఆహారంలో వినియోగిస్తే మలబద్ధకం నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
కొలెస్ట్రాల్‌కు చెక్:
సబ్జా గింజలలో పెక్టిన్ ఉంటుంది, ఇది రక్త కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ మూలకం కడుపులో కొలెస్ట్రాల్ శోషణను పెంచుతుంది. హెల్త్‌లైన్ ప్రకారం, ప్రతిరోజూ తులసి గింజలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను 8 శాతం వరకు తగ్గించవచ్చు.
Also Read : Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్
Also Read : Jagadish Reddy: మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ ఝలక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి