Hair Fall Control Oil: వేసవిలో కాలుష్యం, దుమ్ము, సూర్యుని కిరణాల కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే చాలా మందిలో దీని కారణంగా జుట్టు మూలాలు బలహీనంగా మారుతున్నాయి. దీంతో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా వేగంగా బట్టతల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఇంటి చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ రెమెడీలను పాటించడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా, మృదువుగా తయారవుతుంది.
జుట్టు దృఢంగా, మందంగా తయారు కావడానికి చిట్కాలు:
కలబంద, పెరుగు మాస్క్:
జుట్టు మృదువుగా, ఒత్తుగా తయారు కావడానికి కలబంద, పెరుగు మిశ్రమంతో తయారు చేసిన హెయిర్ మాస్క్‌ను జుట్టుకు ఆప్లై చేయాల్సి ఉంటుంది. ఈ మాస్క్‌ను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల జుట్టు రాలడం, జుట్టు సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయండి:
జుట్టు పొడిబారకుండా ఉండాలంటే రోజూ గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ లభించి, జుట్టు మూలాల నుంచి పోషన కలిగిస్తుంది. దీంతో సులభంగా జుట్టు మృదువుగా, సున్నితంగా తయారవుతుంది.
ఆపిల్ వెనిగర్ సహాయపడుతుంది:
జుట్టు బలంగా, మృదువుగా చేసేందుకు ఆపిల్ వెనిగర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ప్రోటీన్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా జుట్టు మెరిపించడానికి కూడా సహాయపడుతుంది.
జుట్టు తప్పకుండా ఆవిరి పట్టించాల్సి ఉంటుంది:
జుట్టును సంరక్షించుకోవడం చాలా మంచిది. కాబట్టి జుట్టుకి స్ట్రీమ్ పట్టించాల్సి ఉంటుంది. దీని కోసం టవల్‌ను వేడి నీటిలో నానబెట్టి..తల చుట్టూ చుట్టండి. కాసేపు కాసేపు ఇలాగే వదిలేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జుట్టు అందంగా తయారవుతుంది.
ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి:
జుట్టు పొడిబారడానికి ప్రధాన కారణం బలమైన సూర్యరశ్మి.. అతిగా ఎండలో తిరగడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. బలమైన కిరణాల కారణంగా చాలా మందిలో జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook