Flat Foot Myths: ఫ్లాట్ ఫుట్ అంటే ఏమిటి, నిజంగా దీనివల్ల సమస్యలుంటాయా, నిజానిజాలేంటి

Flat Foot Myths: మనిషి శరీరంలో ప్రతి అవయవ ఆకారానికి ఓ నిర్దిష్ట కారణం ఉంటుంది. అందులో భాగంగా పాదం కొద్దిగా ఉంటుంది. కొంతమందికి మాత్రం ఫ్లాట్ ఫుట్ ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే ఫ్లాట్ ఫుట్, ఆర్క్ ఫుట్ రెండు రకాలుంటాయి. ఫ్లాట్ పుట్ అనేది చాలా తక్కువమందిలో కన్పిస్తుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 28, 2024, 04:29 PM IST
Flat Foot Myths: ఫ్లాట్ ఫుట్ అంటే ఏమిటి, నిజంగా దీనివల్ల సమస్యలుంటాయా, నిజానిజాలేంటి

Flat Foot Myths: ఇప్పుడీ ఫ్లాట్ ఫుట్ విషయంలో చాలాకాలంగా కొన్ని అంశాలు ప్రచారంలో, నమ్మకంలో ఉన్నాయి. క్రీడల్లో, డిఫెన్స్ రంగంలో ఫ్లాట్ ఫుట్ అనేది అనర్హతగా భావిస్తుంటారు. అంతేకాదు ఫ్లాట్ ఫుట్ వల్ల భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు ఎదురౌతాయనేది చాలాకాలంగా అందరూ చెబుతూ వస్తున్న విషయం. అయితే తాజాగా వెలుగుచూస్తున్న పలు అధ్యయనాలు ఇదంతా మిథ్యగా తేల్చిచెబుతున్నాయి. 

ఫ్లాట్ ఫుట్ వ్యక్తుల్లో చాలా రకాల సమస్యలు ఎదురౌతాయని, భవిష్యత్తులో నొప్పి, మస్క్యులోస్కెలెటల్ సమస్యలు ఉత్పన్నమౌతాయని అంటారు. చాలామంది వైద్యులు కూడా ఇదే విషయాన్ని నమ్ముతారు. అంటే మజిల్స్, వెయిన్స్, నరాల సమస్య రావచ్చంటారు. అయితే బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ఇటీవల ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఇదంతా మిద్యగా కొట్టిపారేశారు. ఫ్లాట్ ఫుట్ వల్ల నొప్పి, మస్క్యులోస్కెలెటల్ సమస్యలు ఉత్పన్నమౌతాయనే నమ్మకం తప్పని ఆ అధ్యయనంలో ఉంది. మరో అధ్యయనం యూక్యూటీఆర్‌కు చెందిన పీడియాట్రిక్ రీసెర్చ్ ప్రకారం అసలీ నమ్మకం ఎలా మొదలైందనేది ప్రచురితమైంది. 

ఫ్లాట్ ఫుట్‌ను ఓ సమస్యగా పరిగణించడమనేది అనాదిగా వస్తున్నదే. 20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికన్ పీడియాట్రిషియన్ మెర్టెన్ ఎల్ రూట్, విలియమ్ పి ఓరియన్. జాన్ హెచ్ వీద్‌లు వెలుగులోకి తెచ్చారు. పాదం ఆకారంలో తేడా ఉంటే దానిని అసాధారణంగా పరిగణించారు. అంటే పాదం ఆర్క్ ఆకారంలో కాకుండా ఫ్లాట్‌గా ఉంటే అది మంచిది కాదని పరోక్షంగా చెప్పారు. దాంతో వైద్యులు ఇది నిజమేనని నమ్ముతూ వచ్చారు. ఆధునిక అధ్యయనాలు వెలుగులోకి వచ్చేకొద్దీ ఈ సిద్ధాంతం లేదా నమ్మకం మరుగునపడుతూ వచ్చింది. ఫ్లాట్ ఫుట్‌తో అసలు మస్క్యులోస్కెలెటల్ సమస్యలు వస్తాయా లేవా అనేది పరిశీలిస్తే ఆధునిక అద్యయనాల ప్రకారం అలాంటి పరిస్థితి లేదని తెలుస్తోంది. 

అయితే ఈ సిద్ధాంతం లేదా నమ్మకం తప్పని తేలినా ఫ్లాట్ ఫుట్ సమస్య ఉండే వ్యక్తులు కాస్త అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తులకు దెబ్బలు తగిలే ముప్పు అధికంగా ఉంటుంది. ఈ సమస్య ఉండేవారిలో ఎలాంటి లక్షణాలు కన్పించవు. ఇందుకు తగ్గట్టే ఫ్లాట్ ఫుట్ వ్యక్తుల కోసం కొన్ని ప్రత్యేకమైన ఆర్థోపెడిక్ చెప్పులు కూడా మార్కెట్‌లో వచ్చేశాయి. అయితే ఫ్లాట్ ఫుట్ వ్యక్తులకు గాయాల ముప్పు అధికమనే వాదనలో ఎలాంటి నిజం లేదు. 

Also read: Vitamin B12 Benefits: విటమిన్ బి12 లోపం సరి చేసేందుకు ఏం తినాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News