Body Detox Drinks: మనకు తెలియకుండా వివిధ రకాల ఆహార పదార్ధాల రూపంలో చాలా వ్యర్ధాలు శరీరంలో పేరుకుపోతుంటాయి. ఈ వ్యర్ధాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు శరీరంలోంచి ఈ విష లేదా వ్యర్ధ పదార్ధాలను బయటకు పంపించేస్తుండాలి. దీనినే డీటాక్సిఫికేషన్ అంటారు.
మనిషి శరీరం కూడా మెషీన్ లాంటిదే. ఎప్పటికప్పుడు మెషీన్ క్లీనింగ్ ఎలా అవసరమో శరీరాన్ని కూడా అంతర్గతంగా శుభ్రపరుస్తుండాలి. కాలుష్యపూరిత వాతావరణం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వ్యర్ధాలు, విష పదార్ధాలు పేరుకుపోతుంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపించడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే ఈ వ్యర్ధ పదార్ధాలను డీటాక్సిఫికేషన్ ద్వారా బయటకు పంపించేస్తుండాలి. డీటాక్స్ చేసేందుకు మార్కెట్‌లో చాలా రకాల ఔషధాలున్నాయి కానీ సహజసిద్ధంగా కొన్ని డ్రింక్స్ ద్వారా శరీరాన్ని డీటాక్స్ చేయవచ్చు.
స్ట్రాబెర్రీ నిమ్మరసం
స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో నిమ్మరసం కలిపి తాగితే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో స్వెల్లింగ్ సమస్య దూరమవడం, ఇన్సులిన్ స్థాయి మెరుగుపడటం వంటివి కన్పిస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పీహెచ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ శరీరాన్ని శుభ్రపర్చడంలో దోహదపడుతుంది.
జీలకర్ర నీళ్లు
జీలకర్ర నీళ్లు తాగడం వల్ల శరీరం అంతర్గతంగా అద్భుతంగా డీటాక్స్ అవుతుంది. శరీరంలోని అన్ని విష పదార్ధాలు బయటకు తొలగించడంలో, ఆకలి నియంత్రించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ధనియా నీరు
ఉదయం ఖాళీ కడుపున కొత్తిమీర నీళ్లు తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరంలో పేరుకునే అదనపు నీటిని, వ్యర్ధ పదార్ధాలను సహజసిద్ధంగా బయటకు తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని సైతం పెంచుతుంది. శరీరం డీటాక్స్ అవడం వల్ల లివర్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొత్తిమీర నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి చాలా లాభాలున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా కేన్సర్ నుంచి రక్షణలో దోహదం చేస్తుంది.
కీరా-పుదీనా-అల్లం-నిమ్మరసం
ప్రకృతిలో లభించే అద్భుతమైన పదార్ధాలతో తయారు చేసే ఈ డ్రింక్ చాలాశక్తివంతమైంది. శరీరంలోని ప్రతి మూలలో పేరుకునే వ్యర్ధాలు, విష పదార్ధాలు పూర్తిగా బయటకు వచ్చేస్తాయి. కడుపును పూర్తిగా శుభ్రం చేస్తుంది. అదే సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
Also read: AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకు ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook