Sciatica pain: ప్రతి వ్యక్తికీ ఏదో ఒక సమయంలో శరీరంలో ఎక్కడో చోట నొప్పి ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ అనేది చాలా దారుణంగా ఉండే సమస్య. కొంతమందికి నడుము నుంచి కాళ్ల వరకూ నొప్పి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రమాదకరం కావచ్చు. తస్మాత్ జాగ్రత్త.
శరీరంలో సాధారణంగా కింది భాగంలో నొప్పి ఉంటుంది. నడుము నొప్పి, మడమ నొప్పి, కాళ్ల నొప్పి వంటివి ఇందులో ముఖ్యమైనవి. ప్రమాదకరమైన సయాటికాలో ఇలానే ఉంటుంది. నడుముకు చెందిన నరాల్లో ఎక్కడో ఒక చోట స్వెల్లింగ్ ఉండటం వల్ల మొత్తం కాలంతా భరించలేని నొప్పి ఉంటుంది. దీనినే సయాటికా నొప్పిగా పరిగణిస్తారు. ఇది నాడీ వ్యవస్థలో ఎదురయ్యే నొప్పిలో ఒకటి. ఇందులో సయాటికా నరంపై ఏదో ఒక కారణంతో ఒత్తిడి పడుతుంది. సయాటికాలో హిప్పాయింట్ వెనుక నుంచి మొదలుకుని క్రమంగా పెరుగతూ సయాటికా నరం బొటనవేలు వరకూ చేరుతుంది. సయాటికా నరం మన శరీరంలో అతి పొడవైన, లావైన, కీలకమైన నరం. నడుము కింది భాగం నుంచి మొదలుకుని రెండు కాళ్ల వరకూ ఉంటుంది. సయాటికా నొప్పి తీవ్రత పెరిగిపోతుంది.
సయాటికా లక్షణాలెలా ఉంటాయి..
నడుము నొప్పి, నెమ్మది నెమ్మదిగా నొప్పి పెరగడం, కాలి వెనుక భాగంలో నొప్పి, కాళ్లలో మంట లేదా తిమ్మిరి, కాలి వెనుక భాగంలో ఓ వైపు నొప్పి ఉండటం, లేచేటప్పుడు కూర్చునేటప్పుడు నొప్పి ఉండటం ప్రధాన సమస్యలు.
సయాటికా కారణాలేంటి
నాడీ వ్యవస్థలో సమస్య ఏర్పడినప్పుడు ఉంటుంది. వెన్నపూస జారినప్పుడు ఇలా జరుగుతుంది. వెన్నపూసలో ఏదైనా గాయమైనా సరే సయాటికా సమస్య రావచ్చు. జలుబు వల్ల, ఎక్కువగా నడవటం వల్ల, మలం రాకపోవడం వల్ల, మహిళల్లో గర్భం సమయంలో, స్థూలకాయం, నరం దెబ్బతినప్పుడు, ధూమపానం వల్ల ఈ సమస్య తలెత్తుతుంటుంది.
జీవనశైలిలో మార్పులు, ఒంగి బరువైన వస్తువుల ఎత్తకుండా ఉండటం, ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోవడం, వెనుపూస సంబంధిత వ్యాయామం, హై హీల్స్ చెప్పులు మానేయడం వంటివి అలవర్చుకుంటే సయాటికా సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చు.
Also read: Diabetes tips: ఉదయం 8 గంటల్లోగా బ్రేక్‌ఫాస్ట్ తింటే మధుమేహం తగ్గిపోతుందా, వైద్యులేమంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook