Vitamin Deficiency: శరీరంలోని వివిధ అంగాల్లో ముఖ్యమైనవి దంతాలు కూడా. శరీర నిర్మాణం, ఎదుగుదలకు అవసరమైన ఆహారాన్ని గ్రైండ్ చేసి పంపించేది దంతాలే. ఆహారం కోసమే కాకుండా అందానికి కూడా దంతాలు చాలా ముఖ్యం. అందుకే దంతాల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొన్ని రకాల విటమిన్ల లోపం కూడా దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటుంది. అందుకే తినే ఆహారం ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలి. ముఖ్యంగా మూడు విటమిన్లు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఈ మూడు విటమిన్లు దంతాల ఆరోగ్యాన్ని సంరక్షించడమే కాకుండా ఆరోగ్యపరంగా ఇతర సమస్యలు తలెత్తకుండా చేస్తాయి.
విటమిన్ డి
శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ డి కీలకమైంది. ఎముకల బలోపేతం, ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగకరం. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే విటమిన్ ఇది. రోజూ ఉదయం వేళ 7-8 గంటల ప్రాంతంలో 15-20 నిమిషాలు ఎండలో ఉంటే సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. శరీరం ఇతర పోషకాల్ని అందుకునేందుకు విటమిన్ డి చాలా అవసరం.
విటమిన్ బి12
పంటి ఆరోగ్యానికి విటమిన్ బి12 చాలా అవసరమౌతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పంటి రోగాల్ని దూరం చేస్తకుంది. పియోరియో వంటి రోగాలు రాకుండా చేస్తుంది. మీరు తీసుకునే పాల ఉత్పత్తులు, కొవ్వు ఉండే చేపల్లో విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది.
విటమిన్ సి
పంటి రోగాలకు కారణమయ్యే పయోరియాకు ప్రధాన కారణం విటమిన్ సి లోపం. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించేది ఈ విటమినే. విటమిన్ సి అనేది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. చర్మ సంరక్షణ, కేశాల రక్షణకు చాలా ఉపయోగకరం. వివిధ రకాల సీజనల్ వ్యాధులు, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
Also read: Lady Finger Water: బెండకాయను ఇలా తినండి.. గ్యారంటీగా షుగర్‌గా తగ్గిపోతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook