/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Winter Illnesses 2023: శీతాకాలం ప్రారంభం కావవడంతో చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ఇన్‌ఫెక్షన్ల ప్రభావం కూడా రెట్టింపు అవుతుంది. ఇలాంటి సమయంలోనే శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే తీవ్ర ఇన్‌ఫెక్షన్ల కారణంగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. దీని కారణంగా కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ఔషధాలకు బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించి కొన్ని చిట్కాలు పాటించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

ప్రత్యేక ఆయుర్వేద చిట్కాలతో జలుబు, దగ్గు, కఫం, అలెర్జీ నుంచి ఉపశమనం:
పసుపు పాలు:

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు పాలలో పసుపుని కలుపుకుని తీసుకుంటే శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని రోగనిరోధక శక్తిని నియంత్రించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చే జలుబు, దగ్గు, కఫం నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. ఇవే పాలలో మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరాన్ని దృఢంగా చేస్తాయి. 

ములేతి టీ:
పస్తుతం అన్ని ఆయుర్వేద షాపుల్లో ములేతి చూర్ణం లభిస్తోంది. ఇందులో ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు పాలలో కలుపుకుని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం చాలా మంది గొంతు నొప్పులతో కూడా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం కూడా ములేతి టీ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని కూడా సులభంగా తొలగిస్తాయి. దీంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుంగా శరీరాన్ని రక్షిస్తాయి. 

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

ఇమ్యూన్ షాట్స్:
పసుపు, పొడి అల్లంలో శరీరానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్ల, అద్భుతమైన మూలకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు పసుపు, పొడి అల్లంతో తయారు చేసిన చిన్న చిన్న ముద్దలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవండం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరంలోని  హానికరమైన బ్యాక్టీరియా ప్రభావాన్ని తొలగిస్తుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచి, అలెర్జీ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి శీతాకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యల  బారిన పడడకుండా ఉండడానికి ప్రతి రోజు ఇమ్యూన్ షాట్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Section: 
English Title: 
Winter Illnesses 2023: Turmeric Milk And Muleti Tea Provide Relief From Cold, Cough, Phlegm And Allergy In Winter
News Source: 
Home Title: 

Winter Illnesses 2023: జలుబు, దగ్గు, కఫం, అలెర్జీ నుంచి ఉపశమనం కలిగించే అద్భుతమైన ఔషధాలు ఇవే!

Winter Illnesses 2023: జలుబు, దగ్గు, కఫం, అలెర్జీ నుంచి ఉపశమనం కలిగించే అద్భుతమైన ఔషధాలు ఇవే!
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
జలుబు, దగ్గు, కఫం, అలెర్జీ నుంచి ఉపశమనం కలిగించే అద్భుతమైన ఔషధాలు ఇవే!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, November 18, 2023 - 13:00
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
23
Is Breaking News: 
No
Word Count: 
348