Lungs Health: మనిషి జీవితంలో గుండె, లివర్, కిడ్నీలు ఎంత ముఖ్యమైనవో లంగ్స్ కూడా అంతే ప్రాధాన్యత కలిగినవి. బతికి ఉన్నంతవరకూ ఊపిరి ఉంటుందని చెప్పవచ్చు లేదా ఊపిరి ఉన్నంతవరకూ బతికుంటామని చెప్పవచ్చు. మొత్తానికి శ్వాసకోస ప్రక్రియకు లంగ్స్ ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం.
శరీరంలోని వివిధ అంగాల్లానే లంగ్స్ కూడా చాలా ముఖ్యమైనవి. రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేయడంలో లంగ్స కీలక భూమిక వహిస్తాయి. అంతేకాకుండా కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు పంపిస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే లంగ్స్ ఆరోగ్యంపై ఎప్పుడూ నిర్లక్ష్యం వహించకూడదు. ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచాలంటే కొన్ని పద్ధతులు తప్పకుండా పాటించాలంటున్నారు పల్మొనాలజిస్టులు.
అధిక బరువు లేదా అసలు బరువు లేకపోయినా ఆ ప్రభావం ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రతికూలంగా ఉంటుంది. అదనపు బరువు ఎప్పుడూ ఊపిరితిత్తుల్ని సంకోచింపచేస్తుంది. ఫలితంగా శ్వాస ఇబ్బందికరంగా మారుతుంది. బరువు తక్కువగా ఉంచే శ్వాస కోసనాళాలు లాగుతుండటం వల్ల బలం సరిపోదు. అందుకే శరీర బరువు నియమిత మోతాదులోనే ఉండేట్టు చూసుకోవాలి. అంటే ఎక్కువ లేదా తక్కువ ఉండకూడదు.
వ్యాయామం చాలా అవసరం. రోజూ క్రమం తప్పకుండా ఫిజికల్ యాక్టివిటీ అనేది కేవలం కార్డియో వాస్క్యులర్ ఆరోగ్యానికే కాకుండా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడేందుకు దోహదమౌతుంది. వాకింగ్ , స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల లంగ్స్ సామర్ధ్యం తప్పకుండా పెరుగుతుంది. ఆక్సిజన్ సరఫరా సామర్ధ్యం మెరుగుపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉండే ఆహార పదార్ధాలు డైట్‌లో భాగం చేసుకోవాలి. దీనివల్ల లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, లీన్ ప్రోటీన్లు వంటి పోషకాలు లంగ్స్ ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. సాల్మన్ చేపలు, ఫ్లక్స్ సీడ్స్‌లో లంగ్స్ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి.
ఇంట్లో ఉండే గాలి నాణ్యత ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే మీరు నివసించేచోట లేదా పని చేసే చోట పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎయిర్ ఫ్లో ఉండటమే కాకుండా ఎయిర్ క్వాలిటీ బాగుండాలి. పొగాకు, పొగ, మోల్డ్, దుమ్ము, ధూళి ఊపిరితిత్తులపై ప్రతికూల ప్రభావం కల్గిస్తాయి. అందుకే ఎయిర్ క్వాలిటీ బాగున్న చోట ఉండటం మంచిది.
శ్వాస కోస మార్గంలో పేరుకుపోతుండే ఫ్లమ్ లేదా కఫం పల్చగా మార్చాలంటే హైడ్రేట్‌గా ఉండటం చాలా అవసరం. సంక్రమణ కాకుండా ఉంటుంది. శరీరం హైడ్రేట్ గా ఉండాలంటే రోజుకు 8-10 గ్లాసు నీళ్లు తప్పకుండా తాగాలి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే డీప్ బ్రీతింగ్ వ్యాయామం, నో స్మోకింగ్, వ్యాక్సినేషన్, రెగ్యులర్ చెకప్, కాలుష్యానికి దూరంగా ఉండటం వంటివి తప్పకుండా ఆచరించాలి.
Also read: Uric Acid Problem: ఈ చిట్కాలు పాటిస్తే 3 నెలల్లో యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook