Body Pain Relief: వేసవికాలంలో ఇబ్బంది పెట్టే నొప్పులకు చెక్..ఈ చిన్ని చిట్కా పాటిస్తే చాలు

Summer Tips: మనకు తెలియకుండానే మనం వేసవికాలం అలసిపోతూ ఉంటాము. అందుకే ఎండాకాలం వచ్చిందంటే చాలు.. అలసట వల్ల చాలామంది విపరీతమైన  నొప్పులతో బాధపడతారు. కాళ్ల నొప్పుల నుంచి వెన్నునొప్పి వరకు.. పలు రకాల సమస్యలు ఈ సీజన్ లో సర్వసాధారణం. మరి అటువంటి వాటికి దూరంగా ఉంచే చిట్టి ఉపాయాల గురించి తెలుసుకుందాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 26, 2024, 05:16 PM IST
Body Pain Relief: వేసవికాలంలో ఇబ్బంది పెట్టే నొప్పులకు చెక్..ఈ చిన్ని చిట్కా పాటిస్తే చాలు

Body Pain Relief Tips: వేసవికాలం వాతావరణం లో చోటు చేసుకునే పలు రకాల మార్పుల కారణంగా మన శరీరం కొన్ని ఇబ్బందులకు లోనవుతుంది. బయట కాసేపు నడిచి వచ్చిన చాలు ఎక్కువగా అలసిపోతూ ఉంటాం. అందుకే ఈ వేసవికాలం మనం ఎదుర్కొనే సమస్యలలో ఒంటి నొప్పులు ఒకటి. చాలామందికి ఎక్కువగా శరీరం అవ్వడం వల్ల కూడా భుజాల నొప్పి ,మెడ నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళనొప్పి సాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే వీటి కోసం బయట దొరికే టాబ్లెట్స్ వాడడం మంచిది కాదు.. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది .కాబట్టి వీలైనంత వరకు ఎటువంటి వాటిని ఇంటి వద్ద సహజంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.

మరి ముఖ్యంగా పెద్దవారు ఈ నొప్పి అసలు తట్టుకోలేక పనురకాల మాత్రలపై ఆధారపడతారు. కానీ ఇలా ఎక్కువ మోతాదులో మెడిసిన్స్ తీసుకోవడం వల్ల తెలియకుండా గ్యాస్ ,మలబద్ధకం, కడుపునొప్పి ,అజీర్తి,తలనొప్పి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. ఇక మళ్లీ వాటికోసం కొత్తగా మాత్రలు తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటి వద్ద ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం..

అల్లం:

కూరల్లో విరివిగా వాడే అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఉత్పన్నమయ్యే పని రకాల నొప్పులకు మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. ఇక అంతే కాకుండా నొప్పులు ఉన్న దగ్గర అల్లంతో కట్టు లాగా వేయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీనికి చేయాల్సిందల్లా పచ్చి అల్లం ని బాగా పేస్ట్ చేసుకొని ఒక పొడి గుడ్డలో దాన్ని పరిచి ఆ గుడ్డని నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టులాగా కట్టాలి. మంట అనిపిస్తుంది కానీ కాసేపు ఓర్చుకుంటే క్రమంగా ఆ మంటతో పాటు నొప్పి కూడా తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువ మంటగా రాషస్ వచ్చినట్టుగా అనిపిస్తే వేసుకోకండి.

యాపిల్ సైడర్ వెనిగర్:

ఒళ్లు నొప్పులు తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ముఖ్యంగా కాళ్ల నొప్పులను ఇది సులభంగా తగ్గిస్తుంది. ఇందుకోసం ఒక బకెట్ వేడి నీటిలో కాస్త యాపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి ఒక పది నిమిషాలు పాటు నానబెట్టాలి. స్నానం చేసే వేడి నీటిలో కూడా ఒక మూత యాపిల్ సైడర్ వెనిగర్ ని కలుపుకోవడం వల్ల ఒంటి నొప్పులు తగ్గుతాయి.

పసుపు:

పసుపుని మనం వంటకే కాకుండా గాయమైనప్పుడు లేపనంగా కూడా వాడుతాం. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్-ఫ్లమేటరీ,యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు పలు రకాల ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడంతోపాటు కండరాల నొప్పులను కూడా సులభంగా తగ్గిస్తాయి. పసుపు కొమ్మును నూరి మెత్తటి పేస్టు తయారు చేసుకుని.. ఆ పేస్టు నొప్పి ఉన్న లేపనం లాగా పూస్తే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక : పైన అందించిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Read More: Rajasthan Man Collapses: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా ఊహించని ఘటన.. వీడియో వైరల్..

Read MOre: Viral video: రా రా రక్కమ్మ.. పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వీడియో చూస్తే ఆపుకోలేరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News