Heart Attack Risk: యువతలో గుండె వ్యాధులకు కారణం అదేనా, మరేం చేయాలి

Heart Attack Risk: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. ఇది కొట్టుకున్నంతవరకూ మనిషి ప్రాణాలు నిలబడతాయి. నిరంతరం లబ్ డబ్ అంటూ కొట్టుకునే ఒక్కసారిగా ఎందుకు ఆగుతుంది. దీనికి గల కారణాల్లో ప్రధానమైంది కొలెస్ట్రాల్. అంటే కొలెస్ట్రాల్ అంత ప్రమాదకరమైంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 30, 2024, 06:57 PM IST
Heart Attack Risk: యువతలో గుండె వ్యాధులకు కారణం అదేనా, మరేం చేయాలి

Heart Attack Risk: అందుకే హార్ట్ హెల్త్ విషయంలో కొలెస్ట్రాల్ ప్రస్తావన తప్పకుండా వస్తుంటుంది. వయస్సుతో పాటు కార్డియో వాస్క్యులర్ సమస్యలు పెరుగుతుంటాయి. ముఖ్యంగా యువకుల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కన్పిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. కార్డియో వాస్క్యులర్ సమస్య కారణంగా మృత్యువాత పడుతున్నవారిలో 62 శాతం మది భారతీయ యువకులే కావడం మరింత ఆందోళన కల్గిస్తోంది. 

ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల సమస్య అధికంగా కన్పిస్తోంది. అందులోనూ 30-40 ఏళ్ల వయస్సులో ఎక్కువగా సంభవిస్తోంది. ఆధునిక జీవన విధానం, బిజీ లైఫ్ కారణం కావచ్చు. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ గుండె వ్యాధుల్లో కీలకపాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్. ఇది ఎక్కువగా ఉండే గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రెండవది హెచ్‌డీఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ వల్లనే శరీరంలో కణజాలం నిర్మాణం, హార్మోన్స్ తయారీ వంటివి జరుగుతుంటాయి.

శరీరంలో ఎల్‌డీఎల్ పెరిగితే హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. ఎందుకంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో ప్లక్ పేరుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఎంతగా ఉందంటే ప్రతి 10 మందిలో ఆరుగురికి తప్పకుండా ఉంటోంది. కొలెస్ట్రాల్ పెరిగితే గుండె వ్యాధులు, కార్డియో వాస్క్యులర్ సమస్యల ముప్పు పెరుగుతుంది. ఎల్‌డీఎల్ పెరగడం వల్ల ధమనుల్లో ప్లక్ పేరుకోవడం, రక్త నాళాలు కుదించుకుపోవడం, క్లోజ్ కావడం జరుగుతుంది. దాంతో రక్త సరఫరా తగ్గుతుంది. ఇది గుండె పోటుకు దారి తీస్తుంది. 

యువకులు మొదట్నించి ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేస్తుండాలి. మరీ ముఖ్యంగా 20 ఏళ్ల వయస్సు నుంచి కొలెస్ట్రాల్ పరీక్ష అప్పుడప్పుడూ చేయిస్తుంటే మంచిది. ఓ అధ్యయనం ప్రకారం కనీసం 50 మంది యువకుల్లో ఎల్‌డీఎల్ స్థాయి పెరగడాన్ని గమనించినట్టు వైద్యులు చెబుతుంటారు. 40 ఏళ్ల వయస్సు కలిగినవారిలో ఎథెరోస్కోలోరోటిక్ గుండె వ్యాధుల ముప్పు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఒకటి జెనెటిక్ అయితే రెండవది లైఫ్‌స్టైల్. అంటే చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి. ఈ సమస్యల్నించి తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాలి. లైఫ్‌స్టైల్ మార్చుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం కనీసం 30 నిమిషాలు చేయాలి. 

Also read: Liver Detox Tips: ఈ 5 డ్రింక్స్ తాగితే చాలు లివర్ ఎప్పటికీ చెడిపోదు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News