HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు

HMPV Virus: ఊహించిన భయమే వెంటాడుతోంది. రాదు రాదని చెప్పినా వచ్చేసింది. అప్పుడే మూడు ప్రాంతాల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ఇప్పుడు ఇండియాను చుట్టుముడుతోంది. ఈ క్రమంలో ఎలా ఎదుర్కోవాలి, ఏవి చేయకూడదు, ఏవి చేయవచ్చో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 6, 2025, 09:10 PM IST
HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు

HMPV Virus: ప్రపంచవ్యాప్తంగా చైనా కొత్త వైరస్ హ్యూమన్ మెటాన్యుమోవైరస్ స్థూలంగా చెప్పాలంటే హెచ్ఎంపీవీ భయపెడుతోంది. కరోనా సంక్రమణ పూర్తయి ఐదేళ్లు కాగా కొత్త వైరస్ కలకలం రేపుతోంది. అప్పుడే ఇండియాలో ఐదు కేసులు వెలుగుచూశాయి. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం.

హెచ్ఎంపీవీ అలియాస్ హ్యూమన్ మెటానిమోవైరస్ ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఆ దేశంలో తీవ్ర స్థాయిలో ఉందని తెలుస్తోంది. రోగుల సంఖ్య పెరుగుతుండటం వల్ల ఆసుపత్రులు రద్దీగా ఉంటున్నాయని సమాచారం అందుతోంది. ముఖ్యంగా చిన్నారుల్ని ఎక్కువగా ఈ వైరస్ టార్గెట్ చేస్తోంది. చైనా నుంచి హాంకాంగ్, బ్యాంకాక్ దేశాలకు విస్తరించింది. ఇప్పుడు కొత్తగా ఇండియాలో ఎంట్రీ ఇచ్చేసింది. బెంగళూరులో 2 కేసులు, గుజరాత్‌లో 1, చెన్నైలో రెండు కేసులు మొత్తం 5 నమోదయ్యాయి. ఐసీఎంఆర్ సైతం ఈ కేసుల్ని ధృవీకరించింది. అయితే ఈ వైరస్ పట్ల అంతగా భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అరికట్టేందుకు, నియంత్రణకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. 

హెచ్ఎంపీవీ అరికట్టేందుకు ఏం చేయాలి

దగ్గు, తుమ్ములు వస్తున్నప్పుడు నోరు, ముక్కు కవర్ అయ్యేలా మాస్క్ ధరించాలి. లేదా కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. ఇక చేతులు తరచూ సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో, జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ తప్పకుండా ధరించాలి. దగ్గు, జలుబు ఎక్కువగా ఉంటే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం మంచిది. నీరు ఎక్కువగా తాగాలి. శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. 

హెచ్ఎంపీవీ నియంత్రణకు ఏం చేయకూడదు

ఎవరికీ కలచాలనం ఇవ్వద్దు. ఒకరితో మరొకరు దగ్గరగా ఉండవద్దు. టిష్యూ పేపర్లు లేదా కర్చీఫ్ ఒకసారి వాడింది తిరిగి వాడకూడదు. అనారోగ్యంతో ఉండేవారికి దూరంగా ఉండాలి. తరచూ కళ్లు నలుపుకోవడం లేదా కంటికి చేతులు తాకించడం, ముక్కు, నోరు చేత్తో తుడుచుకోవడం మానేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ములు వేయకూడదు.

Also read: HMPV Alert: బెంగళూరులో చైనా వైరస్, అప్రమత్తమైన పొరుగు రాష్ట్రాలు, హై అలర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News