White Hair Reducing Tips: ప్రస్తుతకాలంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్యల యువతి , యువకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని కోసం మార్కెట్లో లభించే ప్రొడెట్స్లను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అయితే ఎలాంటి మందులు, ప్రొడెట్స్ల అవసరం లేకుండా ఇంట్లోనే కొన్ని పదార్థాలు ఉపయోగించి ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మనం ప్రతిరోజు ఆహారంలో కరివేపాకు ను ఉపయోగిస్తాము. దీని వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చు. అయితే ఈ కరివేపాకుతో మనం ఆరోగ్యంతో పాటు జుట్టు సంరక్షణలో కూడా సహాయపడుతుంది. దీని ఉపయోగించడం వల్ల నల్లటి జుట్టును సొంతం చేసుకోవచ్చు. అయితే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నవారు ఈ టిప్‌ను పాటించడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కరివేపాకులో పోషకాలు, యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా లభిస్తాయి.
కరివేపాకు నూనె తయారు చేసుకోవడం ఎలా :
ఒక కప్పు కరివేపాకు, ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకోవాలి. ముందుగా కరివేపాకు ను కొబ్బరి నూనెలో వేసుకోవాలి. నూనెను తక్కువ నుంచి మీడియం వేడి మీద వేడి చేయండి.
నూనెలోని పోషక పదార్ధాలను సంరక్షించడానికి తక్కువగా వేడి చేసుకోవాలి. తర్వాత ఎండు కరివేపాకును బాణలిలో వేయాలి. పది నిమిషాలు తక్కువ వేడి మీదే నూనెలో వేసేయండి.
Also Read Healthy Butter milk: చర్మం -జుట్టు... మజ్జిగలో కరివేపాకు కలిపి తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
ఈ నూనెలో కాసింత వేప నూనెను కలుపుకోవాలి. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. కరివేపాకు నూనెను మీ స్కాల్ప్ , హెయిర్‌కి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ముప్పై నిమిషాల నుంచి గంట వరకు ఉంచండి. షాంపూతో శుభ్రం చేయి నూనెను తొలగించడానికి మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. దీని వల్ల మీకు కాని మీ జుట్టుకు కాని ఎలాంటి హాని జరగదు. తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఈ విధంగా ప్రతిరోజు లేద వారంలో నూనెను ఉపయోగించడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు. నల్ల జుట్టు మీ సొంతం అవుతుంది. ఎలాంటి జుట్టు సమస్యల బారిన పడాల్సి అవసరం ఉండదు.
Also Read Cloves: అధిక రక్తపోటు సమస్యకు ఇలా చెక్ పెట్టిండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter