Hypertension Control Tips: హైపర్ టెన్షన్ అనేది హై బ్లడ్ ప్రెషర్ ఇది సైలెంట్ కిల్లార్ అంటారు. చాలామందిలో కనిపిస్తుంది బీపీ షుగర్ అనేది లైఫ్ స్టైల్ లో మార్పుల వల్ల వస్తుంది. కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా కలుగుతుంది. అయితే బ్లడ్ ప్రెషర్ 140/90 ఎక్కువగా ఉంటే హైపర్ టెన్షన్ కి దారి తీసింది. ఇది గుండె సమస్యలకు ఇతర వ్యాధులకు కూడా దారితీస్తుంది. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు అయితే కొన్ని చిట్కాలతో హైపర్ టెన్షన్ నియంత్రించవచ్చు అది ఏంటి తెలుసుకుందాం.
చాలామందికి హైపర్ టెన్షన్ అంటే తెలీదు దాని లక్షణాలు కూడా గుర్తించలేకపోవచ్చు. అంతేకాదు హైపర్ టెన్షన్ కి లైఫ్ స్టైల్ లో మార్పులు తప్పకుండా చేసుకోవాలని ముందుగా తెలుసుకోవాలి. ముందుగా హైపర్ టెన్షన్ లక్షణాలు ఏ మాత్రం కనిపించడం వైద్యులను సంప్రదించి సరైన మందులు తీసుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి, అంతే కాదు రక్తపోటు పెరగడం వల్ల ఇతర ప్రాణాంతక వ్యాధులు వస్తాయి . ముఖ్యంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ కిడ్నీ సంబంధిత వ్యాధులు మిమ్మల్ని చుట్టుముడతాయి కాబట్టి హైపర్ టెన్షన్ ఎప్పుడూ నియంత్రించుకోవాలి.
అయితే గుడ్ న్యూస్ ఏంటంటే హైపర్ టెన్షన్ లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటే సరైన మందులు తీసుకుంటే సులభంగా నియంత్రించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ బ్లడ్ ప్రెషర్ స్థాయిలు ఆరోగ్యకరంగా ఉంటాయి. కాబట్టి హైపర్ టెన్షన్ బాధ ఉండదు.ముఖ్యంగా ఆరోగ్యకరమైన డైట్ ఎంతో ముఖ్యం సోడియం తక్కువ మోతాదులో తీసుకోవాలి. అంతే కాదు తృణధాన్యాలు, పండ్లు కూరగాయలు, లీన్ డైరీ ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆహారాలు బ్లడ్ ప్రెషర్ స్థాయిలను తగ్గిస్తాయి.
బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉండాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ఎంత అవసరం. ప్రతిరోజు ఒక గంట సేపు అయినా ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉండాలి అంటే ముఖ్యంగా బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్ బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉంచుతాయి. స్ట్రెస్ కూడా హైపర్ టెన్షన్ పెరగడానికి ప్రధాన కారణం తగ్గించుకోవడానికి కొన్ని యోగాసనాలు వేయవచ్చు. మెడిటేషన్ యోగ ,సాధారణ నడక ఇవన్నీ స్ట్రెస్ మేనేజ్మెంట్ లో భాగం హైపర్ టెన్షన్ సమస్య ఉండదు.
బరువు నియంత్రించుకుంటే కూడా హైపర్ టెన్షన్ సమస్య రాకుండా ఉంటుంది. అతిగా బరువు పెరగడం వల్ల గుండె బ్లాక్ లో ఏర్పడతాయి దీంతో బ్లడ్ ప్రెజర్ కి ఆటంకం కలుగుతుంది. వెయిట్ పెరగకుండా ఉంటే హైపర్ టెన్షన్ సమస్య ఉండదు. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఈ గింజ మీ ఇంట్లో ఉంటే చాలు ఆరోగ్యం మీ చెంతే.. ఇలా మీ డైట్ లో చేర్చుకోండి..
ఆల్కహాల్ తీసుకోవడం కూడా బ్లడ్ ప్రెజర్ కి ప్రధాన కారణం వీలైనంత వరకు ఆల్కహాల్ దూరంగా ఉండడానికి ట్రై చేయండి అంతేకాదు స్మోకింగ్ చేయడం వల్ల కూడా రక్తనాళాలు పాడవుతాయి. ప్రాణాంతక గుండె సమస్యలు వస్తాయి ఆ బ్లడ్ ప్రెషర్ నిర్వహించాలంటే మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండాలి.
వీటితోపాటు తరచుగా బ్లడ్ ప్రెషర్లు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి దానికి తగిన విధంగా లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ సమస్య ప్రాణాంతకంగా మారదు. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.వీటితో పాటు ముఖ్యంగా డాక్టర్ సూచించిన మందులను రెగ్యులర్గా తీసుకోవాలి దీంతో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
ఇదీ చదవండి: పెరుగులో జీలకర్ర వేసి తింటే మీ శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి