Hemp Seeds Health Benefits: మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన విత్తనాలు, గింజలు పుష్కలంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. సాధారణంగా గింజలు అంటే వాల్నట్స్, జీడిపప్పు, బాదం మాత్రమే అనుకుంటాం. అయితే ఆరోగ్యకరమైన గింజలు మన డైట్ లో చేర్చుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి. అయితే ఎక్కువగా చాలా మంది వినని మరొక గింజ ఉంది. అదే జనపనార గింజలు (Hemp Seeds). ఈ గింజలు కూడా మన డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కాదు జుట్టు, స్కిన్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ జనపనార విత్తనం ఖనిజాలు, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్యకరం మన డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణుల సూచన. మీ డైట్లో కూడా జనగపనార గింజలు ఉన్నాయా?
ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని రకాల గింజలు మీ డైట్ లో చేర్చుకోవాలని ఇప్పటికే ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు జనపనార గింజల్లో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. జనపనార గింజల్లో అనేక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి అయితే ప్రతిరోజు మీ డైట్ లో జనపనార గింజలను సరైన మోతుల్లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అవి ఏంటో తెలుసుకుందాం
ఇదీ చదవండి: పెరుగులో జీలకర్ర వేసి తింటే మీ శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఏంటో తెలుసా?
జనపనార గింజలు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులకు చెక్ పెడతాయి. పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి అంతేకాదు ప్రాణాంతక గుండె సమస్యలకు కూడా చెక్ పెడతాయి. జనపనార విత్తనాలు తినడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు మన దరిచేరకుండా ఉంటాయి. ఈ గింజలు ముఖ్యంగా జాయింట్ పెయిన్ తో బాధపడేవారు. జనపనార గింజలు తమ డైట్లో చేర్చుకోవడానికి ఇది గుండె ఆరోగ్యానికి తో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? ఈ 10 విధాలుగా మందులు లేకుండానే మేనేజ్ చేయొచ్చు..
జనపనార గింజలను మీ డైట్ లో చేర్చుకోవాలంటే కొన్ని గింజలను మీరు తీసుకునే సలాడ్లో చల్లుకోవాలి. లేకపోతే ఓట్స్ లేదా పెరుగు రూపంలో కూడా తీసుకోవచ్చు. సాధారణంగా జనపనార గింజలతో సూప్ కూడా తయారు చేసుకుంటారు. జనపనార గింజల్లో ప్రోటీన్ ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ తో పాటు ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, సల్ఫర్, క్యాల్షియం, ఐరన్, జింక్, విటమిన్ b6 విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ ఇ, పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముక ఆరోగ్యానికి కూడా ఎంత ఆరోగ్యకరమని చెప్పవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి