డయాబెటిస్ (Diabetes ) లేదా షుగర్ లేదా చెక్కర వ్యాధి.. లేదా మధుమేహం.. పేరు ఏదైనా ఈ సమస్య ఒక్కసారి వస్తే మళ్లీ వెళ్లే అవకాశం లేదు. లేదా చాలా తక్కువ. ఎందుకంటే డయాబెటిస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. మనలో చాలా మందికి రక్తంలో చెక్కర శాతం పెరిగితే ఎంత ప్రమాదమో తెలిసిందే.
డయాబెటిస్ గురించి మరో దారుణమైన విషయం ఏంటంటే..దాన్ని మనం మందులతో, ఆహారంతో ( Food ), వ్యాయామంతో అదుపు చేయగలం కానీ.. పూర్తిగా నయం చేయలేం. ఎన్ని నియమాలు పాటించినా మధుమేహం వల్ల ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. అందుకే తిండి విషయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ALSO READ| Dry Cough: ఈ మూడు చిట్కాలు పాటిస్తే పొడిదగ్గు ఇట్టే తగ్గిపోతుంది
ఒక వేళ మీకు డయాబెటిస్ ఉందని తెలిస్తే.. మీరు వెంటనే మీ ఫుడ్ లిస్ట్ లోంచి దాదాపు అన్ని ఆహార పదార్ధాలను తొలగిస్తారు. ఏది తినాలో అర్థం కాదు చాలా మందికి. అయితే ఇటీవలే వెల్లడైన పరిశోధనలో గుడ్డు వల్ల మధుమేహాన్ని అదుపు చేయవచ్చు అని తేలింది.
ఈస్టర్న్ ఫిన్ ల్యాండ్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం .. డయాబెటిస్ ఉన్న వాళ్లు ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవచ్చట. అయితే దానికి పక్కాగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆ రూల్స్ ఏంటంటే..
1) మీరు ఉదయానే గుడ్డును ఉడకబెట్టాలి అనుకుంటే ఒక రోజు ముందే.. రాత్రి గుడ్డును వినీగర్ లో ముంచి తీసి పక్కన పెట్టండి.తరువాత వాటిని పొద్దున్నే ఉడకపెట్టి తినవచ్చు.
ALSO READ| WHO Kitchen Tips: ఇన్ఫెక్షన్ నుంచి ఆహారాన్ని సురక్షితంగా ఉంచే WHO చిట్కాలు
2) ఉడకపెట్టిన గుడ్లే కాదు డాల్చిన చెక్క ( Cinnamon ) వల్ల కూడా శరీరంలో చెక్కర శాతం తగ్గుతుంది. శరీరంలో ఇన్సూలిన్ ను దాల్చిన కంట్రోల్ చేస్తుంది. అందుకే మీరు మీ ఆహారంలో, చాయ్ లో చిటికెడంత దాల్చిన మిక్స్ చేసుకోవచ్చు. దాంతో పాటు గుడ్డుపై దాల్చిన పొడి చల్లి తింటే మంచి రుచితో పాటు..ఆరోగ్యానికి (Health) కూడా చాలా మంచిది.
3) గుడ్డులో ఎన్నో పోషకాలు, ప్రోటీన్ ఉంటుంది అని అందికీ తెలుసు. అంతే కాదు గుడ్డులో కాల్షియం, ఓమెగా-3 ఫాటీ యాసిడ్స్ కూడా మెండుగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే గుడ్డును సరైన విధానంలో తినడం అలవాటు చేసుకోవాలి.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR