Health benifits of Jaggery: బెల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వైద్యులు సైతం కొంతమంది పేషెంట్లకు సుగర్‌కు బదులు బెల్లం తీసుకోమని చెబుతుంటారు. బెల్లంతో ఆరోగ్యానికి ఎటువంటి హానీ లేకపోగా.. అందులోని ఔషధ గుణాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఐరన్, జింక్ కారణంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా నయమవుతాయి.
మొత్తం శరీరాన్ని శుభ్రపరుస్తుంది
ఫుడ్ కెమిస్ట్రీ 2009 అధ్యయనం ప్రకారం బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు సైటోప్రొటెక్టివ్ నాణ్యతను అందిస్తాయి. అంటే ఊపిరితిత్తుల నుండి శ్లేష్మాన్ని తొలగించడమే కాకుండా లోపలి నుంచి శ్వాస కోశ, జీర్ణవ్యవస్థలను శుభ్రపరచడంలో దోహదపడుతుంది. ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా బెల్లం తీసుకుంటే.. అది మీ శరీరం మొత్తాన్ని శుభ్రపరుస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
భోజనం తర్వాత కొంతమంది బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటారు. అది ఆరోగ్యానికి మంచిది. బెల్లం జీర్ణాశయంలో ఎంజైమ్‌ల విడుదలకు దోహదపడుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు, మలబద్దక సమస్యలు నయమవుతాయి.
రక్తహీనతను నివారిస్తుంది
బెల్లంలో ఐరన్, పాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారు బెల్లం తీసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.
గ్లూకోజ్ నియంత్రణతో పాటు బరువు తగ్గేందుకు :
చక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు పెరగడాన్ని, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెల్లం తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు బెల్లం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Also Read: How To Break shivratri Fasting: శివరాత్రి ఉపవాసం తర్వాత ఇవి తింటే ఆరోగ్యానికి మంచిదట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook