Loose Motion: లూస్ మోషన్స్‌తో బాధపడుతున్నారా..? ఈ ఆకులతో ఉపశమనం పొందండి..!!

Loose Motion: భారత్‌లో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలు దాటాయి. వేడిగాలులు, మండుతున్న ఎండలు కారణంగా సాధారణ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ వాతావరణం కారణంగా చాలా మంది హీట్‌స్ట్రోక్‌(Heatstroke)కు గురవుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 4, 2022, 04:57 PM IST
  • వేసవిలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
  • అతిసారం, హీట్‌ స్ట్రోక్‌లో పస్తే కొత్తిమీర తినండి
  • కొత్తిమీర టీ శరీరానికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది
Loose Motion: లూస్ మోషన్స్‌తో బాధపడుతున్నారా..? ఈ ఆకులతో ఉపశమనం పొందండి..!!

Loose Motion: భారత్‌లో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలు దాటాయి. వేడిగాలులు, మండుతున్న ఎండలు కారణంగా సాధారణ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ వాతావరణం కారణంగా చాలా మంది హీట్‌స్ట్రోక్‌(Heatstroke)కు గురవుతున్నారు. ఆ తర్వాత అతిసారం వ్యాధితో బాధపడుతున్నరని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే.. భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఇంటి నివారణల ద్వారా అతిసారం వ్యాధి నుంచి రక్షిణ పొందవచ్చు .

ఆహారంపై  ప్రత్యేక శ్రద్ధ వహించాలి:

వేసవిలో మనం ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  కడుపుని, శరీరానికి చల్లధనాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ముఖ్యంగా కొత్తిమీరతో వండిన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. 

అతిసారం, హీట్‌ స్ట్రోక్‌లో పస్తే కొత్తిమీర తినండి:

పచ్చి కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండి శరీరానికి ఎన్నో లాభాలను ఇస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కొత్తిమీర ఆకుల్లో ఉండే యాసిడ్ గుణా‌లకు డయేరియా ప్రభావం తగ్గే అవకాశాలున్నాయి.

కొత్తిమీర టీ ప్రయోజనాలు:

హీట్ స్ట్రోక్, డయేరియా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటే.. మీరు కొత్తిమీర టీని తాగోచ్చు. ఈ టీ లూజ్ మోషన్‌కు మెడిసిన్‌లా పనిచేస్తుంది. అంతే కాకుండా శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. 

 కొత్తిమీర టీని ఎలా తయారు చేసుకోవాలి:

ఈ టీని సిద్ధం చేయడానికి ముందుగా కొత్తిమీర కట్టలను తీసువాలి. దానిని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇలా చేసిన పెస్ట్‌ను ఒక గ్లాసు నీటిలో కలిపి మరిగించాలి. ఇప్పుడు టీ స్టయినర్‌తో ఫిల్టర్ చేసి తాగండి.

కొత్తిమీర ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు:

మీ వంటకాలలో  కొత్తిమీర ఆకులను చేర్చుకోవాడం ద్వారా శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా శరీర అభివృద్ధి కూడా తోడ్పడుతుంది. 

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Amla And Honey Mix Benefits: ఉసిరికాయలో దీనిని కలపి తినండి.. మధుమేహం నుంచి ఉపశమనం పొందండి.!!

Also Read: Imran-Avanthika: మొన్న చైతూ-సామ్ జంట..ఇప్పుడు ఇమ్రాన్-అవంతికలు..త్వరలో విడాకులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News