Pomegranate vs Diabetes: మధుమేహం ఎంత ప్రమాదకరమైందో..జాగ్రత్తగా ఉంటే అంతగా నియంత్రించుకోవచ్చు. మధుమేహం నియంత్రణ కూడా సాధ్యమే. ప్రకృతిలో విరివిగా లభించే దానిమ్మతో మధుమేహ వ్యాధిగ్రస్థులకు చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
ఆధునిక జీవనశైలి తీసుకొచ్చిన వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్. ఎంత ప్రమాదకరమైందంటే ఒకసారి తగులుకుంటే జీవితాంతం వెంటాడుతుంది. అయితే ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల ద్వారా బ్లడ్ షుగర్ నియంత్రించుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్థులు పండ్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల పండ్లు ప్రయోజనం చేకూరిస్తే..మరికొన్ని హాని కల్గిస్తాయి. అదే విధంగా దానిమ్మ మంచిదా కాదా అనే విషయంపై చాలా సందేహాలున్నాయి.
దానిమ్మ తినడం వల్ల శరీరంలో పెద్దమొత్తంలో పోషక పదార్ధాలు లభిస్తాయి. దానిమ్మ గింజలు తింటే ఎక్కువ ప్రయోజనమా లేదా దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలెక్కువా అనే విషయంపై కూడా సందేహాలు వస్తుంటాయి.ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవాళ్లు దానిమ్మ తినవచ్చా లేదా అనే సందిగ్దంలో ఉంటారు.
మధుమేహం వ్యాధిగ్రస్థులకు దానిమ్మతో ప్రయోజనాలు
దానిమ్మలో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. నిపుణుల ప్రకారం దానిమ్మలో ఉండే పౌష్టిక గుణాలు డయాబెటిస్ వంటి వ్యాధులతో పోరాడుతాయి. దానిమ్మ గింజలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇది డయాబెటిస్ రోగులకు చాలా అవసరం. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులు దానిమ్మ జ్యూస్ కాకుండా..గింజల్ని నమిలి తింటే చాలా మంచిది.
Also read: Anti Aging Drinks: వృద్ధాప్య ఛాయల్ని తొలగించి..యవ్వనంగా ఉంచే డ్రింక్స్ ఏంటో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.