Summer Fruits: మండు వేసవిలో ఈ పండ్లను తీసుకుంటే.. మీ బాడీ అస్సలే డీహైడ్రేషన్ కాదు!

Summer Seasonal Fruits in India. ఎండాకాలంలో మ‌న శ‌రీరంలో నీరు ఇట్టే ఆవిరైపోయి.. డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోవడంతో పాటు పండ్లను కూడా తినాలి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2022, 04:46 PM IST
  • వేసవిలో ఈ పండ్లను తీసుకోవాలి
  • ఎండ వేడిమిలో ఈ పండ్లను తప్పక తినాలి
  • మీ బాడీ డీహైడ్రేషన్ కావొద్దంటే..
Summer Fruits: మండు వేసవిలో ఈ పండ్లను తీసుకుంటే.. మీ బాడీ అస్సలే డీహైడ్రేషన్ కాదు!

Summer Special Fruits: ప్రస్తుతం ఎండలు మండి పోతున్నాయి. సూర్యుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. చాలా ప్రాంతాల్లో ఎండలు 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటేసాయి. ఈ మండు వేసవిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త అజాగ్రత్తగా ఉన్నా.. అనారోగ్యం భారిన పడక తప్పదు. ముఖ్యంగా ఎండాకాలంలో మ‌న శ‌రీరంలో నీరు ఇట్టే ఆవిరైపోయి.. డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటితో పాటు పండ్లను కూడా తినాలి. దీనివల్ల శ‌రీరంలో నీరు త‌గినంత ఉంటుంది. మ‌రి వేస‌విలో మ‌నం నిత్యం తినాల్సిన ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పుచ్చకాయ:
వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవాలి. పుచ్చకాయ‌లో 92 శాతం నీరే ఉంటుంది. అందువ‌ల్ల శ‌రీరానికి త‌గినంత నీరు ల‌భిస్తుంది. శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. అజీర్తి సమస్యకు కూడా పుచ్చకాయ‌ బాగా ఉపయోగపడుతుంది. 

కీరదోస‌:
వేస‌విలో మ‌నం తినాల్సిన వాటిలో ముఖ్యమైంది కీరదోస‌ ఒకటి. కీర‌దోస‌లను తింటే శ‌రీరం చ‌ల్లబడుతుంది. శ‌రీరానికి త‌గినంత నీరు కూడా ల‌భిస్తుంది. కీర‌దోస‌లు తీసుకుంటే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు.

మల్బరీ:
వేసవిలో మల్బరీ తినడం వల్ల అనేక రకాల వ్యాధులు సోకకుండా ఉంటాయి. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుంది. అంటే డయాబెటిక్ పేషెంట్లకు కూడా మల్బరీ మేలు చేస్తుంది.

స్ట్రాబెర్రీ:
మండు వేసవిలో స్ట్రాబెర్రీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో విటమిన్-సి మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వేసవిలో మిమ్మల్ని తాజాగా ఉంచుతాయి. వేసవిలో స్ట్రాబెర్రీలు తింటే వేడి నుండి ఉపశమనం కూడా లభిస్తుంది.

ద్రాక్ష:
వేసవిలో తీసుకోవాల్సిన మరో పండు ద్రాక్ష. ద్రాక్షల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని వేస‌విలో తింటే శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. శ‌రీరం కూడా చల్లగా ఉంటుంది.

జ్యూస్:
ఎండాకాలం వచ్చిందంటే.. జ్యూస్ తప్పక తీసుకోవాలి. వేసవిలో జ్యూస్ తాగితే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఏదైనా పండ్ల జ్యూస్ తీసుకునేందుకు ప్రయత్నించండి.

Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్‌ దూరం..!

Also Read: Viral Video: స్కర్ట్‌ వేసుకొని యువకుడి డ్యాన్స్‌.. అచ్చు రష్మికను దించేశాడుగా! ఫిదా అవుతున్న నెటిజన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News