Viral Video: స్కర్ట్‌ వేసుకొని యువకుడి డ్యాన్స్‌.. అచ్చు రష్మికను దించేశాడుగా! ఫిదా అవుతున్న నెటిజన్లు

Man dressed in kurta, dances to Pushpa song Saami. భారత్‌కు చెందిన కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతే.. తాజాగా స్కర్ట్ ధరించి పుష్పలోని సామి సామి సాంగ్‌కు డాన్స్ చేశాడు. జైనిల్ అచ్చు రష్మికను దించేశాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2022, 03:29 PM IST
  • స్కర్ట్‌ వేసుకొని యువకుడి డ్యాన్స్‌
  • అచ్చు రష్మికను దించేశాడుగా
  • ఫిదా అవుతున్న నెటిజన్లు
Viral Video: స్కర్ట్‌ వేసుకొని యువకుడి డ్యాన్స్‌.. అచ్చు రష్మికను దించేశాడుగా! ఫిదా అవుతున్న నెటిజన్లు

Man dressed in kurta and dances to Pushpa song Saami: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,  నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. గతేడాది డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా.. అన్ని భారతీయ భాషల్లో ఊహించని కలెక్షన్లను రాబట్టి సునామీ సృష్టించింది. పుష్ప సినిమాకు సంబంధించిన డైలాగ్స్‌, పాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 'తగ్గేదేలే' అనే డైలాగ్‌ షోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది.

చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరిని కదిలించినా.. పుష్ప పాటలకు చిందులేశారు. పెళ్లి, ఫంక్షన్స్ ఏదైనా సరే.. పుష్ప సాంగ్ ఉండాల్సిందే అనేలా పుష్ప రాజ్ చేశాడు. ఇప్పటికే ఎందరో సెలెబ్రిటీలు పుష్ప పాటలకు రీల్స్, డాన్స్ చేయగా.. తాజాగా ఓ యువకుడు మాత్రం అంతకుమించి చేశాడు. ఏకంగా అమ్మాయిలు ధరించే స్కర్ట్ వేసుకొని స్టెప్పులు వేశాడు. ఈ స్టెప్పులు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లను ఈ వీడియోను చూసి ఫిదా అవుతున్నారు. చాలా ఎనర్జీతో డాన్స్ వేశాడని నెటిజన్లు అతడిని ప్రశంసిస్తునారు.

అయితే ఈ స్టెప్పులు వేసింది ఎవరో కాదు.. భారత్‌కు చెందిన కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతే.  జైనిల్ తరచూ అమ్మాయిలాగా డ్రెస్సులు వేసుకొని ఆమెరికాలో డ్యాన్స్‌లు చేస్తుంటాడు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ నృత్యాలను బాగా వేస్తాడు. ప్రస్తుతం వాటిని అమెరికాలోని వీధుల్లో ప్రదర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌, వీడియోలు చేస్తున్నాడు. జైనిల్ డాన్స్ చేస్తూనే నెటిజన్లను ఆకర్షిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా స్కర్ట్ ధరించి పుష్పలోని సామి సామి సాంగ్‌కు డాన్స్ చేశాడు. జైనిల్ అచ్చు రష్మికను దించేశాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jainil Mehta (@jainil_dreamtodance)

అంతకుముందు చాలా మూవీల్లోని పాటలకు జైనిల్ స్టెప్స్ వేశాడు. ఇటీవల ఆలియా భట్‌ కథనాయకిగా నటించిన 'గంగూభాయ్ కతియావాడి' సినిమాలోని ఝూమ్ రే గోరీ సాంగ్‌కి జైనిల్ అదిరే స్టెప్స్‌ వేశాడు. కొరియోగ్రాఫర్ జైనిల్ డ్యాన్స్‌లను కొందరు నెటిజన్లు ప్రశంశించగా.. మరికొందరు అమ్మాయిల డ్రెస్సులే ఎందుకు వేసుకోవాలని అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌కు  వారాంతంలో 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్‌ దూరం..!

Also Read: KA Paul: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News