గుండె పరికరాల్లో మూడొంతులు సూక్ష్మజీవులే

వైద్యులు గుండె ఆపరేషన్లలో ఉపయోగించే పరికరాల్లో  మూడోవంతు పరికరాలు సూక్ష్మజీవులతో కలుషితమైనాయి. అందులో ఒక ప్రాణాంతక బాక్టీరియా కూడా ఉంది. ఆలాంటి పరికరాలతో ఆపరేషన్ చేస్తే గుండెకు.. తద్వారా మనిషి ప్రాణానికే ప్రమాదం.. చనిపోవచ్చు కూడా

Last Updated : Nov 19, 2017, 03:02 PM IST
గుండె పరికరాల్లో మూడొంతులు సూక్ష్మజీవులే

సూక్ష్మజీవులను దగ్గరికి రాకుండా ఉంచాలంటే చేతులు, కాళ్లు, శరీరం శుభ్రంచేసుకోవాలి.. సబ్బుతో, డెటాల్ తో చేతులు కడుక్కోవాలి అని డాక్టర్లు చెబుతుండడం మనము పాటించండం చూశాం. కానీ డాక్టర్లు వాడే పరికరాల్లో మూడొంతులు సూక్ష్మజీవులతో కలుషితమైనవేనని ఇటీవల ఒక పరిశోధనలో వెల్లడింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

'వైద్యులు గుండె ఆపరేషన్లలో ఉపయోగించే పరికరాల్లో  మూడోవంతు  పరికరాలు సూక్ష్మజీవులతో కలుషితమైనాయి. అందులో ఒక ప్రాణాంతక బాక్టీరియా కూడా ఉంది. ఆలాంటి పరికరాలతో ఆపరేషన్ చేస్తే గుండెకు.. తద్వారా మనిషి ప్రాణానికే ప్రమాదం.. చనిపోవచ్చు కూడా' అని హెచ్చరించారు. 

బైపాస్ ఆపరేషన్ లో రోగి రక్తాన్ని, అవయవాల ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు డాక్టర్లు హీటర్ కూలర్ యూనిట్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఈ యూనిట్లలో బ్యాక్టీరియా ఉందని తమ పరిశోధనలో గుర్తించాము. మొత్తం 89 యూనిట్లను పరిశీలించగా.. 33 ప్రమాదకరంగా ఉన్నాయని, అందులో మైకోబాక్టీరియం చిమెరా కనిపించిందని శాస్త్రవేత్త జాన్ రిహ్స్ వివరించాడు.

Trending News