Thyroid Disease: థైరాయిడ్ లక్షణాలేంటి, రోజూ ఆ మిశ్రమం తీసుకుంటే థైరాయిడ్‌కు చెక్

Thyroid Disease: ఆధునిక జీవన శైలిలో ప్రధానంగా కన్పించే సమస్య థైరాయిడ్. థైరాయిండ్ ఉంటే ఎలా గుర్తు పట్టవచ్చు, ఎలా నియంత్రించాలనేది తెలుసుకోవడం చాలా అవసరం. థైరాయిండ్ లక్షణాలేంటో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 26, 2022, 05:53 PM IST
Thyroid Disease: థైరాయిడ్ లక్షణాలేంటి, రోజూ ఆ మిశ్రమం తీసుకుంటే థైరాయిడ్‌కు చెక్

Thyroid Disease: ఆధునిక జీవన శైలిలో ప్రధానంగా కన్పించే సమస్య థైరాయిడ్. థైరాయిండ్ ఉంటే ఎలా గుర్తు పట్టవచ్చు, ఎలా నియంత్రించాలనేది తెలుసుకోవడం చాలా అవసరం. థైరాయిండ్ లక్షణాలేంటో చూద్దాం.

చాలామందికి థైరాయిడ్ ఉన్నా తెలియదు. దాంతో థైరాయిడ్ సమస్య పెరిగిపోతుంటుంది. అందుకే థైరాయిడ్‌ను సకాలంలో గుర్తించగలిగితే త్వరగా నియంత్రించుకోవచ్చు. మరి థైరాయిడ్ గుర్తించడం ఎలా, థైరాయిడ్ ఉంటే శరీరంలో ఏ విధమైన సమస్యలుంటాయో తెలుసుకుందాం. తద్వారా థైరాయిడ్ ముదరకముందే చికిత్సతో నయం చేసుకోవచ్చు.

థైరాయిడ్ ఎలా గుర్తించాలి, లక్షణాలేంటి

థైరాయిడ్ సమస్య ఉంటే స్థూలకాయం వెంటాడుతుంది. ప్రస్తుత తరుణంలో థైరాయిడ్ అనేది సాధారణమైపోయింది. సాధారణంగా అయోడిన్ లోపంతో థైరాయిడ్ సమస్య వస్తుంటుంది. ఎక్కువగా మహిళల్లో కన్పిస్తుంది. ఈ పరిస్థితుల్లో మహిళలు బరువు పెరిగిపోతుంటారు. దాంతోపాటు శరీరం బలహీనమైపోతుంది. స్థూలకాయం ఏర్పడుతుంది. దాంతో పలు వ్యాధులు సంక్రమిస్తాయి.

థైరాయిడ్‌ను ఎలా నియంత్రించడం

థైరాయిడ్ నుంచి విముక్తి పొందేందుకు తులసి ఆకుల రసం తీసి..అందులో ఒక స్పూన్ అల్లోవెరా జ్యూస్ కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల థైరాయిడ్ నియంత్రణవుతుంది. అంతేకాకుండా తులసి టీతో కూడా మంచి ఫలితాలుంటాయి. డీకాషన్‌లో తులసి ఆకులు వేసి తాగవచ్చు. ఇలా కూడా థైరాయిడ్ నియంత్రించవచ్చు.

Also read: Diabetes Control Tips: మధుమేహాన్ని సమూలంగా నిర్మూలించేందుకు..నేరేడు గింజలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News