Tomato Reduce Cholesterol: టమాటో చాలా మంది ప్రతి రోజు ఆహారాల్లో వినియోగిస్తూ ఉంటారు. అయితే వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు సలాడ్స్‌లో టమాటోని వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే టమాటోను ప్రతి రోజు తీసుకోవడం వల్ల నిజంగా కొలెస్ట్రాల్ తగ్గుతుందా? దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ గుండెపై ఎలా ప్రభావం చూపుతుందో మీకు తెలుసా?:
బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ ధమనుల్లో పేరుకుపోయి ఫలకంలా ఏర్పడుతుంది. దీని కారణంగా రక్త ప్రవాహంలో మార్పులు చేర్పులు వస్తాయి. దీంతో తరచుగా ఛాతీ నొప్పి, గుండెపోటు సమస్యల వస్తాయి. అయితే ఇలాంటి సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మరణిస్తున్నారని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ పేర్కొంది.
Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
టమాటో కొలెస్ట్రాల్‌ను ఎలా కరిగిస్తుంది?:
టమాటో లైకోపీన్ అనే మూలకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటితో తయారు చేసిన జ్యూస్‌ని తాగడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె సమస్యలు, మధుమేహం, క్యాన్సర్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారాలు ఇవే:
శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరగడానికి ప్రతి రోజు పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాల్స ఉంటుంది. అంతేకాకుండా ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి