Walking for Weight Loss: పెరుగుతున్న శరీర బరువును తగ్గించుకోవడానికి చాలా మంది విపరీతంగా కష్టపడుతున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. ఆరోగ్య నిపుణులు సూచించిన పలు చిట్కాలతో సులభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చు. పలు ఆరోగ్య నియమాలతో పాటు వాకింగ్ చేయడం వల్ల సులభంగా బెల్లీ ఫ్యాట్‌తో పాటు బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. విపరీతంగా శరీర బరువు పెరుగుతున్నవారు తప్పకుండా 1 గంట పాటు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని రోజులు వాకింగ్ చేయడం వల్ల మంచి సులభంగా బరువు తగ్గొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గొచ్చా?:
ప్రస్తుతం చాలా మంది 8 నుంచి 9 గంటల పాటు ఆఫీసుల్లో అదే పనిగా కూర్చుటున్నారు. ఇలా కూర్చోవడం వల్ల బరువు పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా ప్రతి రోజు కూర్చోవడం వల్ల కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గంటలో 5 నిమిషాల పాటు వాకింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కొలుస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
ప్రతి రోజు మూడున్నర నెలల పాటు గంటసేపు నడవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పొట్టను కూడా 20 నుంచి 30 శాతం తగ్గించుకోవచ్చు. కాబట్టి అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఇలా వాకింగ్ చేయాల్సి ఉంటుంది.
వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ప్రతి రోజు గంట పాటు వాకింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా శరీరం యాక్టివ్ కూడా మారుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాకింగ్ వల్ల శరీర దృఢంగా కూడా మారుతుంది. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వాకింగ్ చేయాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook