Remedies For Chin Pimples: చెంపపై ఉండే మొటిమలను పోగొట్టుకోవాలంటే... ఈ చిట్కాను ట్రై చేయండి !

Top 10 Home Remedies For Pimples: మహిళలు అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీని కోసం మార్కెట్‌లో లభించే ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ముఖ సౌందర్యాన్ని మొటిమలు పాడు చేస్తాయి. ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చని చర్మనిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2024, 12:44 PM IST
Remedies For Chin Pimples: చెంపపై ఉండే  మొటిమలను పోగొట్టుకోవాలంటే... ఈ చిట్కాను ట్రై చేయండి !

Top 10 Home Remedies For Pimples: మనలో చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతుంటారు.  దీనికోసం మార్కెట్‌ లో లభించే క్రీమ్‌లు , ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. కొంతమందిలో చెంపపై మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ మొటిమల వల్ల ఆందోళన చెందుతారు. యర్, గ్లోయింగ్ స్కిన్ తిరిగి పొందాలంటే  మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాల ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

చెంపపై మొటిమలను తొలగించే చిట్కాలు ఇవే: 

పసుపు: 

పసుపులో యాంటీ-వైరల్ యాక్టివిటీని కలిగి ఉందని.  ఇది కేవలం వంటలోనే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  ఇది చర్మ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.చెంపపై మొటిమలకు కూడా రెమెడీగా పనిచేస్తుంది.

𓇊 పసుపును తేనెతో కలిపి పేస్ట్ లా చేసి మీ చెంపలపై ఇరువైన నిమిషాల తర్వాత మీ ముఖాన్ని బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

టీ ట్రీ ఆయిల్: 

టీ ట్రీ ఆయిల్  చర్మ సంరక్షణలో ఎంతో ఉపయోగాపడుతుంది. ఈ ఆయిల్‌లో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాని తొలగించడంలో సహాయపడుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.

𓇊 టీ ట్రీ ఆయిల్‌లో కాటన్ బాల్‌ను ముంచి, పడుకునే ముందు మొటిమలు ఉన్న చెంపపై అప్లై చేయండి.  మీరు ఉదయం చర్మం చేసుకున్న తర్వాత చాలా మంచి ఫలితాలను పొందుతారు.

తేనె: 

తేనెను ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. ఇది చర్మం మాయిశ్చరైజింగ్‌, యాంటీ బాక్టీరియల్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. 

𓇊 తేనెను మీ చెంపపై ఉన్న మొటిమల పై అప్లై చేయడం వల్ల మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. పదిహేను నిమిషాల పాటు తేనెను చెంపపై ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

అలోవెరా: 

అలోవెరా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. చర్మం అందంగా కనిపించడంలో అలోవెరా ఎంతో మేలు చేస్తుంది.

𓇊 అలోవెరా జెల్‌ను  మీ చెంపపై అప్లై చేసి ఇరువై నిమిషాల తర్వాత ముఖం కడుకోవాలి. ఇలా చేయడం వల్ల చెంపపై ఉండే మొటిమలు తగ్గుతాయి.

Also Read Hot Sauce: సాస్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News