Weight Loss Tips: మీ డైట్‌లో వీటిని తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం!!

Weight Loss Foods: బరువు తగ్గించడంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు సహాయపడుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే ఎలాంటి ఆహారపదార్ధాలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.   

Written by - Shashi Maheshwarapu | Last Updated : Sep 4, 2024, 12:18 PM IST
Weight Loss Tips: మీ డైట్‌లో వీటిని తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం!!

Weight Loss Foods: బరువు తగ్గడం అనేది ఒక రకమైన గణిత సమీకరణం లాంటిదే.  తీసుకునే కేలరీల సంఖ్య కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తే, బరువు తగ్గుతారు. అయితే కొన్ని ఆహారాలు తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి ఇవి ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఇలాంటి ఆహారాలను తినడం వల్ల బరువు తగ్గడం సులభమవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వల్ల బరువు తగ్గడం సాధ్యమవుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆహారాలు మన జీవక్రియను పెంచి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.

బరువు తగ్గాలి అనుకొనేవారు ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉన్న ఆహారపదార్థాలు ఉంటాయి. వీటితో సులువుగా బరువు తగ్గవచ్చు. 

తక్కువ కేలరీలు ఉన్న కూరగాయలు:

పచ్చని ఆకు కూరలు:  పాలకూర, బ్రోకలీ, కాలే, ముల్లంగి ఆకులు, చిన్నగోగు ఆకులు వంటివి. ఈ కూరగాయలు కేలరీలు తక్కువగా ఉండి, విటమిన్ K, విటమిన్ A, ఫోలేట్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి.

క్యాబేజ్: క్యాబేజ్‌ను సలాడ్‌లలో, సూప్‌లలో లేదా స్టూలలో జోడించవచ్చు. ఇందులో ఫైబర్‌, విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. 

క్యారెట్: క్యారెట్‌లో బీటా-కెరోటిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ A గా మారుతుంది. ఇవి కళ్ళ ఆరోగ్యం కోసం చాలా ముఖ్యమైనవి.

టొమాటో:  టొమాటోలో ఉండే లైకోపీన్‌ శక్తివంతమైనది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీని సలాడ్‌లు, సూప్‌లు, సాస్‌లలో ఉపయోగించవచ్చు.

వంకాయ: వంకాయలో ఫైబర్, విటమిన్ K పష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది.

బీన్స్: బీన్స్ ప్రోటీన్, ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ కణాలను రక్షించడంలో సహాయపడతాయి.

వీటితో పాటు కొన్ని ఆరోగ్యకరమైన డ్రింక్స్, ఆహారపదార్థాలు‌ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అందులో కొన్నిపదార్థాలు ఎంటో మనం తెలుసుకుందాం. 

డార్క్‌ చాక్లెట్‌ డ్రింక్‌: 

డార్క్‌ చాక్లెట్‌ నచ్చనివారు అంటూ ఉండరు. చాలా మంది ఇందులో ఎక్కువ కేలరీలు ఉంటాయని భావిస్తారు కానీ ఓ అధ్యయనంలో డార్క్‌  చాక్లెట్‌ తిన్నవారు  పిజ్జాని తక్కువగా తింటారు అని తెలిసింది. అయితే దీని ఎక్కువగా కాకుండా అతి తక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. 

గ్రీక్ యోగార్ట్:

గ్రీక్ యోగార్ట్ అనేది ఒక ఆరోగ్యకరమైన పదార్థం. ఇది సాధారణ పెరుగు కంటే ఎంతో మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతాయి. దీని వల్ల సులువుగా బరువు తగ్గుతారు. 

బీన్స్‌:

బీన్స్‌ ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో ప్రోటిన్‌, ఫైబర్‌ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతాయి. దీని వల్ల బరువు తగ్గుతారు. 

సూప్‌:

సూప్‌ ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం. దీని కొంతమంది ఉదయం లేదా భోజనం తరువాత తీసుకుంటారు. అయితే సూప్‌లో  వంద కేలరీలు ఉండేలా చూసుకోవాలి.

గమనిక:

ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. మీకు ఏదైనా సందేహం ఉంటే వైద్యుడిని సంప్రదించండి.

Also Read: Chickpeas: ఈ సమస్యలు ఉన్నవారు శనగపప్పు తింటే డేంజర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter

Trending News