Trains Cancelled in South Central Railway: హైదరాబాద్ : సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకు ఏకంగా 36 రైళ్లను రద్దు చేస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో స్పష్టంచేశారు. అలాగే పలు ఎంఎంటీఎస్ రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్టు సీపీఆర్వో తెలిపారు. హైదరాబాద్ - సికింద్రాబాద్ మార్గంలో రైల్వే ట్రాక్ మరమ్మతుల పనుల కోసం ఈ రైళ్ల రద్దును దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది
ఈ నెల 26వ తేదీ నుంచి రద్దు కానున్న ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..
లింగంపల్లి - హైదరాబాద్
హైదరాబాద్ - లింగంపల్లి
చందానగర్ - లింగంపల్లి
లింగంపల్లి - చందానగర్
లింగంపల్లి - ఫలక్‌నుమా
ఫలక్‌నుమ - లింగంపల్లి
రామచంద్రాపురం - ఫలక్‌నుమ
సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రద్దు కానున్న 36 రైళ్లు వివరాలు ఇలా ఉన్నాయి.
కాజీపేట - డోర్నకల్
డోర్నకల్ - కాజీపేట
డోర్నకల్ - విజయవాడ
విజయవాడ - డోర్నకల్
భద్రాచలం - విజయవాడ
విజయవాడ - భద్రాచలం
సికింద్రాబాద్ - వికారాబాద్
వికారాబాద్ - సికింద్రాబాద్
సికింద్రాబాద్ - వరంగల్
వరంగల్ - హైదరాబాద్
సిర్పూర్ టౌన్ - కరీంనగర్
కరీంనగర్ - సిర్పూర్ టౌన్
కరీంనగర్ - నిజామాబాద్
నిజామాబాద్ - కరీంనగర్
కాజీపేట - సిర్పూర్ టౌన్
బల్లార్షా - కాజీపేట
భద్రాచలం - బల్లార్షా
సిర్పూర్ టౌన్ - భద్రాచలం
కాజీపేట - బల్లార్షా
బల్లార్షా - కాజీపేట
కాచిగూడ - మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ - కాచిగూడ
కాచిగూడ - రాయచూరు
రాయచూరు - గద్వాల్
గద్వాల్ - రాయచూర్
రాయచూరు - కాచిగూడ
సికింద్రాబాద్ - మేడ్చల్
మేడ్చల్ - సికింద్రాబాద్
ఇదిలావుంటే, ఇటీవల ఒడిషాలోని బాలాసోర్ వద్ద రైలు ప్రమాదం జరిగిన అనంతరం రైల్వే ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలోనూ ఈశాన్య రాష్ట్రాల దిశగా పలు మార్గాల్లో రాకపోకలు సాగించే పలు రైళ్లను ఇండియన్ రైల్వే తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇంకొన్ని రైళ్లను తాత్కాలికంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించిన విషయం విదితమే.