COVID-19 Cases : అదుపులో ఉన్న కోవిడ్, 11,903 మందికి కోవిడ్ పాజిటివ్‌

COVID-19 Cases 14% Higher Than Yesterday: తాజాగా కోవిడ్ వల్ల 311 మంది మరణించారు. ఒక్క కేరళలో (Kerala) 187 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం కేసులు 3.43 కోట్లకు చేరాయి. అలాగే 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 11:58 AM IST
  • దేశంలో కాస్త అదుపులో ఉన్న కరోనా
  • కొత్త కేసుల్లో కాస్త హెచ్చుతగ్గులు
  • 11,903 మందికి కోవిడ్ పాజిటివ్‌
  • 311 మంది మరణం
COVID-19 Cases : అదుపులో ఉన్న కోవిడ్, 11,903 మందికి కోవిడ్ పాజిటివ్‌

COVID-19 Cases 14% Higher Than Yesterday: తాజాగా కోవిడ్ వల్ల 311 మంది మరణించారు. ఒక్క కేరళలో (Kerala) 187 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం కేసులు 3.43 కోట్లకు చేరాయి. అలాగే 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు.

11,903 New COVID-19 Cases In India, 14% Higher Than Yesterday: దేశంలో కరోనా (Corona) వ్యాప్తి కాస్త అదుపులోనే ఉంది. కొత్త కేసుల్లో కాస్త హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా 10,68,514 మందికి కొవిడ్ (COVID) నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,903 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కేసులు 14 శాతం మేర పెరిగాయి. ఇక తాజాగా కోవిడ్ వల్ల 311 మంది మరణించారు. ఒక్క కేరళలో (Kerala) 187 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం కేసులు 3.43 కోట్లకు చేరాయి. అలాగే 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read : Huzurabad Bypoll Results: పిల్లాడిలా ఏడ్చేసిన గెల్లు శ్రీనివాస్..?? వీడియో వైరల్

ఇక నిన్న 14,159 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.37 కోట్లకు చేరువయ్యాయి. ప్రస్తుతం 1,51,209 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. యాక్టివ్ కేసులు (Active cases) 252 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. ఆ రేటు 0.44 శాతం తగ్గగా.. రికవరీ రేటు 98.22 శాతానికి పెరిగింది. 

ఇక గత కొద్ది రోజులుగా కోవిడ్ కాస్త అదుపులో ఉండడంతో యాక్టివ్ కేసులు, రికవరీ రేట్లు సానుకూలంగానే నమోదవుతున్నాయి. మరోపక్క దేశంలో వ్యాక్సినేషన్‌ (Vaccination‌) కూడా చాలా వేగంగానే సాగుతోంది. దీంతో కూడా కోవిడ్ (Covid) కాస్త అదుపులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 107 కోట్ల పైగానే వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.

Also Read : Raghuveera reddy: ఆయనకు ఏమైంది, ఎందుకు స్థంభానికి కట్టేశారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News