School girls raped by managers in UP: ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) దారుణం వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ స్కూల్‌కి చెందిన 17 మంది పదో తరగతి విద్యార్థినులపై ఇద్దరు స్కూల్ మేనేజర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. సీబీఎస్ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ (CBSE Exams) పేరుతో విద్యార్థినులను రాత్రి పూట స్కూల్లోనే ఉంచి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. విద్యార్థినులకు ఇచ్చిన ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి... వారు అపస్మారక స్థితిలోకి వెళ్లాక లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ ఏడాది నవంబర్ 17న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని పుర్కాజీ పట్టణానికి చెందిన ఇద్దరు ప్రైవేట్ స్కూల్స్ మేనేజర్స్ సీబీఎస్ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరిట 17 మంది పదో తరగతి విద్యార్థినులను నవంబర్ 17వ తేదీ రాత్రి స్కూల్‌కు రప్పించారు. ఆ సమయంలో ఆ ఇద్దరు డైరెక్టర్స్ తప్ప అక్కడ మరో టీచర్ లేరు. ఆ రాత్రి విద్యార్థినులకు పెట్టిన భోజనంలో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చారు. బాలికలు అపస్మారక స్థితిలోకి వెళ్లాక వారిపై లైంగిక దాడికి (Rape on School girls) పాల్పడ్డారు.
అంతకుముందు రోజు, ఇద్దరు మేనేజర్లలో ఒకరు ఆ విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్ గురించి చెప్పారు. మరో స్కూల్లో వారికి ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అదే సమయంలో బాలుర తల్లిదండ్రులకు ఫోన్ చేయకపోవడం గమనార్హం. ఆ మేనేజర్ తన స్నేహితుడైన మరో ప్రైవేట్ స్కూల్ మేనేజర్‌తో కలిసి విద్యార్థినులను అతని స్కూల్‌కు తీసుకెళ్లాడు. అక్కడే ఇద్దరు కలిసి వారిపై అఘాయిత్యానికి (Class 10 girls raped in UP) ఒడిగట్టారు.ఈ విషయం ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని... తల్లిదండ్రులను చంపేస్తామని ఆ ఇద్దరు స్కూల్ డైరెక్టర్స్ విద్యార్థినులను బెదిరించారు. దీంతో ఆ విద్యార్థినులెవరూ దీనిపై నోరు మెదిపే సాహసం చేయలేదు.
ఇలా వెలుగులోకి :
ఎట్టకేలకు ఇద్దరు విద్యార్థినులు తమపై జరిగిన అఘాయిత్యంపై (Rape) తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఉత్వాల్‌ను ఆశ్రయించారు. ఆ బీజేపీ ఎమ్మెల్యే స్థానిక ఎంపీకి ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే ఉత్వాల్ మాట్లాడుతూ... బాధిత బాలిక (Uttar Pradesh Rape Incident) తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ... వారు పట్టించుకోలేదన్నారు. పేద కుటుంబానికి చెందినవారు కాబట్టే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. మరోవైపు, ఎస్పీ మాట్లాడుతూ... నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: Viral Video: పెళ్లి వేడుకలో భగ్న ప్రేమికుడు హల్ చల్.. దేహశుద్ధి చేసిన పెళ్లిపెద్దలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook