ఈ రైళ్ల వేగంతో.. ప్రయాణ గంటలు తగ్గింపు

  

Last Updated : Oct 20, 2017, 07:19 PM IST
ఈ రైళ్ల వేగంతో.. ప్రయాణ గంటలు తగ్గింపు

భారతీయ రైల్వే శాఖ ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. 500 కిలోమీటర్ల దూరం వెళ్లే రైళ్ళ వేగాన్ని పెంచి ప్రయాణ కాలాన్ని కనీసం రెండు గంటలపాటు తగ్గించే ప్రయత్నం చేస్తోంది. నవంబరు నెలాఖారు  నుండి ఈ ప్రయోగాత్మక పద్ధతి అమలులోకి రానుంది.

ఆటోమెటిక్ సిగ్నలింగ్, అధిక వేగాన్ని తట్టుకోగల కోచ్‌లతో రైళ్ళు వేగంగా నడవడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ఆదేశం మేరకు ఈ కొత్త రైల్వే టైమ్ టేబ్లింగ్‌కు రూపకల్పన చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు.

ఈ టైమ్ టేబుల్ ప్రకారం ప్రతీ రైల్వే డివిజన్‌లో మెయిన్‌టెనెన్స్ పనుల నిమిత్తం రెండు నుండి నాలుగు గంటలు కేటాయిస్తారు. ట్రైన్ ఆలస్యంగా బయలుదేరడం లేదా ఎక్కడైనా ఆగిపోవడం, అనుకున్న సమయానికి మెయిన్‌టెనెన్స్ ఉద్యోగులు అందుబాటులో లేకపోవడం వల్ల సాధారణంగా రైళ్ళు అనుకున్న సమయానికి చేరుకొనే పరిస్థితి ఉండదు.

కానీ కొత్త పద్ధతి వల్ల ఇవ్వన్నీ ఒక కొలిక్కి వస్తాయి అంటున్నారు అధికారులు.  ఈ పద్ధతి ద్వారా హాల్టింగ్ టైమును తగ్గిస్తున్నారు.  అలాగే రైల్వే శాఖ ప్రస్తుతం 50 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ళను సూపర్ ఫాస్ట్ సర్వీసులుగా మార్చే దిశగా ప్రయత్నిస్తోంది. 

Trending News