Meghalaya: మేఘాలయ(Meghalaya)లో ఘోర ప్రమాదం జరిగింది. 21మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఓ బస్సు(Bus) ప్రమాదవశాత్తు బోల్తా పడి నదిలో పడిపోయింది. తురా నుంచి షిల్లాంగ్(Shillong) వెళ్తున్న బస్సు అర్ధరాత్రి 12 గంటల సమయంలో నోంగ్‌చ్రామ్ ప్రాంతంలోని రింగ్ది నది(Ringdi river)లో ఒక్కసారిగా పడిపోయింది. బస్సులోని ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా...16 మంది గాయపడ్డారు.
నాలుగు మృత దేహాలను వెలికి తీయగా, మరో రెండు మృత దేహాలు బస్సులోనే చిక్కుకొని ఉన్నాయి. చిక్కుకున్న మృతదేహాలతో పాటు మరికొంతమంది ప్రయాణికులను వెలికి తీయడానికి ఈస్ట్ గారో హిల్స్(East Garo Hills) పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వెంటనే సహాయం చర్యల్ని చేపట్టి గాయపడినవారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా.. ప్రమాద సమయంలో బస్సు చాలా వేగంగా ప్రయాణిస్తోందని..అలా వేగంగా దూసుకుపోతు..అదుపుతప్పి బస్సు ముందు భాగం బ్రిడ్జిని ఢీకొట్టి నదిలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Also Read: Humanity at its worst: కోతులకు విషం పెట్టి.. గోనెసంచుల్లో కుక్కి..ఆపై..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook