UP Polls: యూపీలో కొత్త రాజకీయ సమీకరణాలు.. చంద్రశేఖర్ ఆజాద్‌తో చేతులు కలపనున్న అఖిలేశ్..

Samajwadi Party alliance with Azad Samaj Party:ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ శనివారం (జనవరి 15) మధ్యాహ్నం 12.30గంటలకు నిర్వహించే జాయింట్ ప్రెస్ మీట్‌లో పొత్తుపై అధికారిక ప్రకటన చేయనున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2022, 09:40 AM IST
  • యూపీలో తెర పైకి కొత్త రాజకీయ సమీకరణాలు
  • ఎస్పీ, ఆజాద్ సమాజ్ పార్టీ మధ్య పొత్తు
  • ఇవాళ అధికారిక ప్రకటన చేయనున్న నేతలు
UP Polls: యూపీలో కొత్త రాజకీయ సమీకరణాలు.. చంద్రశేఖర్ ఆజాద్‌తో చేతులు కలపనున్న అఖిలేశ్..

Samajwadi Party alliance with Azad Samaj Party: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త రాజకీయ సమీకరణాలు తెర పైకి వస్తున్నాయి. ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), రాష్ట్రీయ లోక్ దళ్ (RLD), జనవాది పార్టీ (సోషలిస్ట్), అప్నా దళ్ (కృష్ణా పటేల్), ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ-లోహియా (PSP-L)లతో పొత్తు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ మరో పార్టీతో పొత్తుకు సిద్ధమైంది. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ సారథ్యంలోని ఆజాద్ సమాజ్ పార్టీతో ఎస్పీ చేతులు కలపనుంది.

ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ శనివారం (జనవరి 15) మధ్యాహ్నం 12.30గంటలకు నిర్వహించే జాయింట్ ప్రెస్ మీట్‌లో పొత్తుపై అధికారిక ప్రకటన చేయనున్నారు. రెండు రోజుల క్రితం ఈ ఇద్దరు నేతలు సమావేశమై ఇరు పార్టీల మధ్య పొత్తు, సీట్ల పంపకాలపై చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ ఆజాద్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తుతో బరిలో దిగాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇరువురి లక్ష్యం రాష్ట్రంలో బీజేపీని ఓడించడమేనని... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

దళితుల ఓట్లు చీలుతాయా...?

ఎస్పీ-ఆజాద్ సమాజ్ పార్టీల మధ్య పొత్తు కుదరడంతో యూపీలో దళితుల ఓట్లు చీలుతాయా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకూ బహుజన్ సమాజ్ పార్టీకి అక్కడి దళితులు సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. అదే సామాజికవర్గం నుంచి ఎదిగొచ్చిన యువ నాయకుడు ఆజాద్ ఎస్పీతో చేతులు కలపడంతో బీఎస్పీ ఓటు బ్యాంకుకు గండి పడవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు విభేదాలు పక్కనపెట్టిన పొత్తుతో బరిలో దిగిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ బీజేపీని నిలువరించడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయి. ఆ తర్వాత మాయావతి ఎస్పీతో తెగదెంపులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తు దళితుల ఓట్లను ఆకర్షించడంలో కలిసొస్తుందని ఎస్పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: RRB: ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ సీబీటీ-1 2019 ఫలితాలు విడుదల, అభ్యర్థులు ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News