ఢిల్లీ: షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీకి ముద్దు బిడ్డ లాంటి వారు అని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఆమె మృతి తనను తీవ్ర దిగ్భాంతికి గురిచేసిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకురాలిగా ఎదిగిన ఆమెతో తనకు వ్యక్తిగతంగా చాలా చనువు, సాన్నిహిత్యం ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఆమె కుటుంబసభ్యులకు, ఆమెను అభిమానించే ఢిల్లీ వాసులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించిన రాహుల్ గాంధీ.. ఢిల్లీకి ఆమె నిస్వార్థంగా సేవలు అందించారని కొనియాడారు.
షీలా దీక్షిత్ మృతిపై ప్రియాంకా గాంధీ స్పందిస్తూ.. ఆమె మృతి తీవ్ర దిగ్భాంతికి గురిచేసిందని అన్నారు. ఢిల్లీకి, దేశానికి షీలా దీక్షిత్ అందించిన సేవలు మరువలేనివి అని ప్రియాంకా గాంధీ కొనియాడారు.