PM Modi: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత అవార్డు...తొలి విదేశీయుడిగా మోదీకి గుర్తింపు..

PM Modi: ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది భూటాన్​. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 12:07 PM IST
PM Modi: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత అవార్డు...తొలి విదేశీయుడిగా మోదీకి గుర్తింపు..

Bhutan confers highest civilian award on PM Modi: భూటాన్ అత్యున్నత పురస్కారం(Bhutan highest civilian award) ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi)ని వరించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది. భూటాన్​ దేశ అత్యున్నత అవార్డు న్గడగ్ పెల్ గి ఖోర్లో(Ngadag Pel gi Khorlo)ను మోదీకి  బహుకరించాలని భూటాన్​ రాజు జిగ్మే ఖేసర్​ నగ్మే వాంగ్​చుక్​ సూచించినట్లు తెలిపింది. 

కరోనా సమయంలో మోదీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నట్లు ప్రకటించింది భూటాన్​ ప్రధాని మంత్రి కార్యాలయం. ఈ అవార్డును 2008లో నెలకొల్పారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీయుడు ప్రధాని మోదీ. గత నెలలో భూటాన్‌(Bhutan)లో ఈ-రూపే కార్డు(RuPay card) యొక్క రెండవ దశను మోదీ ప్రారంభించారు. నేడు(డిసెంబరు 17) భూటాన్ దేశ జాతీయ దినోత్సవం. ఈ సందర్భంగా ఈ దేశ అత్యున్నత అవార్డును  మోదీకి ప్రకటించడం ఆనందంగా ఉందని భూటాన్ ప్రధాని లోటే షెరింగ్(Lotay Tshering) అన్నారు. 

Also Read: Minimum Age For Marriage: అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్ల నుంచి 21కి పెంపు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News