BJP leader shot dead by bike-borne assailants: ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో బీజేపీ నాయకుడిని (BJP leader) దుండగులు కాల్చి చంపారు. రాత్రివేళ సుమారు 8 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు ఆయనపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ (Firozabad) లోని నార్ఖి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిరోజాబాద్ బీజేపీ ఉపాధ్యక్షుడు డీకే గుప్తా (46) (DK Gupta) స్థానికంగా ఓ కిరాణా దుకాణం నడుపుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళుతుండంగా రాత్రివేళ 8గంటల ప్రాంతంలో కొందరు దుండగులు బైక్‌పై వచ్చి డీకే గుప్తాపై కాల్పులు (BJP leader shot dead ) జరిపి పారిపోయారు.
గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడిన డీకే గుప్తాను ఆగ్రాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే గుప్తా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. బీజేపీ నాయకుడి హత్యపై ఆగ్రహించిన స్థానికులు, బీజేపీ కార్యకర్తలు ఈ ప్రాంతంలో ధర్నాకు దిగడంతో చాలా గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయింది. అయితే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని శాంతింపజేశారు. అయితే.. గుప్తా కుటుంబ సభ్యులు కొందరిపై అనుమానం వ్యక్తంచేశారని, వారి పేర్లు నమోదు చేసుకోని విచారణ
చేపడుతున్నామని ఫిరోజాబాద్ ఎస్పీ సచింద్ర పటేల్ తెలిపారు. Also read: Navratri Day 1: స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం
ఇదిలాఉంటే.. ఈ ఘటన జరిగిన ప్రాంతం తుండ్లా నియోజకవర్గంలో ఉంది. ఈ తుండ్లా నియోజకవర్గానికి (Tundla constituency) 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు భారీ భద్రత కల్పించారు. Also read: Navratri 2020: అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ? ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Uttar Pradesh: బీజేపీ నాయకుడి హత్య