సంచనల నిర్ణయాలకు మారుపేరుగా నిలిచిన బీఎస్పీ చీఫ్ మాయవతి మరో సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ కు మద్దతిచ్చే విషయాన్ని పునారాలోచిస్తామని ప్రకటించారు. గతంలో నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దళితులపై నమోదయ్యాయి.ఈ కేసులను ఎత్తి వేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్న మాయవతి..ఈ కేసులను ఎత్తి వేయకపోతే, మద్దతుపై తాము పునరాలోచిస్తామని హెచ్చరించారు.
ఇటీవలె జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ కు బీఎస్పీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మద్దతుపై పునరాలోన చేస్తామనే మామవతి ప్రకటనతో కాంగ్రెస్ పెద్ద షాక్ తగిలినట్లే..రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేనప్పటికీ కీలకమైన మధ్యప్రదేశ్ లో బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో మాయవతి తీసుకున్న నిర్ణయంలో మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఏర్పడింది. దీంతో మాయవతి డిమాండ్ పై కాంగ్రెస్ ఏ మేరకు స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది