ఈ రోజు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ..!

బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొని వచ్చి.. జాతీయ స్థాయిలో మరో వేదికను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేస్తున్నారు. 

Last Updated : Nov 19, 2018, 11:02 AM IST
ఈ రోజు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ..!

బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొని వచ్చి.. జాతీయ స్థాయిలో మరో వేదికను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇదే విషయంపై చర్చించడానికి ఆయన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం కోల్‌కతాకు వెళ్లాలని నిశ్చయించుకున్న చంద్రబాబు నాయుడు.. ఆ భేటీలో బీజేపీయేతర పార్టీల భవిష్యత్తు కార్యాచరణ మీద చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ భేటీని ముగించుకొని చంద్రబాబు తిరిగి అమరావతి రానున్నారు.

ఈ నెల 22వ తేదిన ఢిల్లీలో బీజేపీయేతర పార్టీలు ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబు, మమతా బెనర్జీల భేటీ అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కూ, కాంగ్రెస్‌కు మధ్య పలు వివాదాలున్నాయి. అదేవిధంగా వామపక్షాలకు,  తృణమూల్ కాంగ్రెస్‌కూ కూడా పడడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు.. అందుకు తృణమూల్ కాంగ్రెస్‌ సహకారం అడిగేందుకు చంద్రబాబు కోల్‌కతా వెళ్లారని వార్తలు వస్తున్నాయి. 

ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొన్ని విషయాల్లో ఒకే రకమైన ప్రణాళికలు వేస్తున్నాయి. ఉదాహరణకు, చంద్రబాబు సీబీఐ దర్యాప్తులను రాష్ట్రంలో చేయడానికి అధికారం ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేస్తే.. ఆ నిర్ణయానికి మమత కూడా తన మద్దతు ఇచ్చారు. తర్వాత ఆమె కూడా తమకు సీబీఐ సేవలు అక్కర్లేదని మరో జీఓ విడుదల చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడాన్ని కూడా మమత సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, మమతా బెనర్జీల భేటీ మరోమారు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

Trending News