Rahul Gandhi: ప్రత్యర్థికి చుక్కలు చూపించిన రాహుల్ గాంధీ.. మార్షల్ ఆర్ట్స్ చేస్తు హల్ చల్.. వీడియో వైరల్..

  Rahul gandhi martial arts: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు. తొందరలో.. భారత్ డోజో యాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 29, 2024, 03:57 PM IST
  • భారత్ డోజో యాత్రపై కీలక ప్రకటన..
  • వైరల్ గా మారిన రాహుల్ మార్షల్ ఆర్ట్స్ వీడియో..
Rahul Gandhi: ప్రత్యర్థికి చుక్కలు చూపించిన రాహుల్ గాంధీ.. మార్షల్ ఆర్ట్స్ చేస్తు హల్ చల్..  వీడియో వైరల్..

Rahul gandhi martial arts video goes viral:  కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా.. మరోసారి సంచలనంగా వ్యాఖ్యలు చేశారు. తొందరలోనే.. భారత్ డోజోయాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్రల పేరిట పాదయాత్రలను నిర్వహించారు. దీనిలో భాగంగా.. 2024 లో భారత్ జోడోయాత్రలో.. మొత్తంగా 110 జిల్లాల, 100 ఎంపీ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజక వర్గాల గుండా.. 6,713 కిమీ మే పాదయాత్ర చేపట్టారు. అంతకంటే ముందు.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు భారత్ జోడో యాత్రను నిర్వహించారు. రాహుల్ గాంధీ దేశంలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తెప్పించేందుకు ఈ యాత్రలు చేపట్టినట్లు తెలుస్తోంది.

 

దీనిలో భాగంగా.. గతంలో ఆయన నిర్వహించిన రెండు పాదయాత్రలకు కూడా ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ అనూహ్యంగా అధికారంలోకి కూడా వచ్చింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. భారత్ డోజో పేరుతో ఈ యాత్ర కొనసాగుతుందని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.

మార్షల్ డోజో అంటే.. మార్షల్ ఆర్ట్స్ లను నేర్చుకునే వారికి ట్రైనింగ్ ఇచ్చే కేంద్రాలను డోజోలు అని పిలుస్తారు. అంతేకాకుండా.. గతంలో రాహుల్ పాదయాత్ర చేసేక్రమంలో.. ప్రతిరోజు జివు జిట్సూ(బ్రెజిల్ మార్షల్ ఆర్ట్స్) లను ప్రాక్టిస్ చేసేవారంట.  ఫిట్ గా ఉండేందుకు ఇలా చేసేవారంట. దీనిలో ముఖ్యంగా బాక్సింగ్ మాదిరిగా, కరాటేల మాదిరిగా ప్రత్యర్థులకు దెబ్బలు వంటివి తగలవు.

Read more: Himanta biswa: మమతా నీకేంత ధైర్యం.. మమ్మల్ని బెదిరిస్తావా..?.. ఎక్స్ లో రెచ్చిపోయిన సీఎం హిమంత బిశ్వశర్మ..

ఘర్షణ వాతావరణాన్ని అత్యంత సౌమ్యంగా, అహింసా పద్ధతులు దీనిలో ఉపయోగిస్తారంట. ఈ రోజు ముఖ్యంగా నేషనల్ స్పోర్ట్స్ డే నేపత్యంలో రాహుల్ గాంధీ .. ఎక్స్ వేదికగా ఈ పోస్టును చేశారు. దీన్ని ఏవిధంగా అభ్యసించారో.. దీని మెళకువలు కూడా ప్రజలతో పంచుకున్నారు. ఇప్పటికే.. తనకు.. అకిడోలో బ్లాక్ బెల్ట్ ఉందని, జివూ జిట్సూలో బ్లూబెల్టు కూడా వచ్చినట్లు రాహుల్ తెలిపారు. ఈ మార్షల్ ఆర్ట్స్ లో భాగంగా రాహుల్ గాంధీ తన ప్రత్యర్థిని మట్టికరిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News