సామాన్యులకు కోవిడ్ వ్యాక్సిన్ ( Covid vaccine ) అందాలంటే 2022 వరకూ ఆగాల్సిందేనా..నిపుణుల వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఓ వ్యక్తి జాగ్రత్తలు తీసుకోకపోతే అది తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ( AIIMS Director Dr Randeep Guleria ) తెలిపారు. సామాజిక దూరం, మాస్క్ ధరించడం గురించి ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ సంక్రమణ కొనసాగుతుండటం, దేశంలో ఉన్న వనరులు, ముందున్న సవాళ్లు, చికిత్సా విధానం, ఎప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే విషయాలపై ఆయన సమగ్రంగా మాట్లాడారు. సామాన్యులకు కోవిడ్ వ్యాక్సిన్ ( Corona vaccine ) అందాలంటే 2022 వరకూ ఆగాల్సిందేనని డాక్టర్ గులేరియా స్పష్టం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ ( Corona virus )గానీ..వైరస్ కట్టడి గానీ భిన్నంగా ఉందని చెప్పారు. ముంబాయి, మహారాష్ట్రలో మొదట్లో కేసులు ఎక్కువగా ఉండేవని..ఇప్పుడక్కడ తగ్గుతోందని గుర్తు చేశారు. ఇక ఢిల్లీ ( Delhi ) గురించి మాట్లాడితే..ఇంకా ఢిల్లీలో వైరస్ పీక్స్‌కు చేరిందని చెప్పలేమని..ప్రస్తుతానికి ధర్డ్‌వేవ్ ( Corona third wave ) లో ఉందన్నారు. గ్రామాల్లో సామాజికదూరం సహజంగా ఉండే కారణంగా రూరల్ ఇండియా ఇంకా పెద్దగా కరోనా వైరస్ తో ప్రభావితం కాలేదన్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరగడానికి చాలా కారణాలున్నాయన్నారు. వాతావరణం ప్రధానమైన కారణమన్నారు. శీతాకాలంలో ఢిల్లీ ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోతుందని..వైరస్ సంక్రమణ వేగం పుంజుకోడానికి ఇది దోహదపడుతుందన్నారు.
సామాన్య ప్రజలు వ్యాక్సిన్ తీసుకోడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం పడుతుందన్నారు. ఇతర ఫ్లూ వ్యాక్సిన్‌లా ఎప్పటివరకూ ఈ వ్యాక్సిన్ మార్కెట్లో అందుబాటులో వస్తుందనేది చూడాలన్నారు. 2021 చివరికి గానీ..2022 ప్రారంభంలో గానీ ఇది సాధ్యం కావచ్చన్నారు. Also read: Karnataka: ఐఏఎస్ అధికారి నివాసంలో ఏసీబీ దాడులు
Delhi: కరోనా వ్యాక్సిన్ సామాన్యుడికి చేరేది 2022లోనే