ఎర్రకోటను ఆ ప్రైవేటు కంపెనీకి ఎందుకు తాకట్టు పెట్టారు: కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

ఢిల్లీలోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం ఎర్రకోటకు సంబంధించిన పలు బాధ్యతలను ఎందుకు దాల్మియా భారత్ లిమిటెడ్ అనే ప్రైవేటు కంపెనీకి కేంద్రం అప్పగించిందో తెలపాలని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది

Last Updated : Apr 29, 2018, 07:58 AM IST
ఎర్రకోటను ఆ ప్రైవేటు కంపెనీకి ఎందుకు తాకట్టు పెట్టారు: కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

ఢిల్లీలోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం ఎర్రకోటకు సంబంధించిన పలు బాధ్యతలను ఎందుకు దాల్మియా భారత్ లిమిటెడ్ అనే ప్రైవేటు కంపెనీకి కేంద్రం అప్పగించిందో తెలపాలని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గతంలో ఎర్రకోట పరిరక్షణకు సంబంధించి దాల్మియా భారత్ అనే ప్రైవేటు సంస్థకు, కేంద్ర పర్యాటక శాఖకు మధ్య ఒప్పందం కుదిరింది.

చారిత్రక సంస్థలను పరిరక్షించడానికి ఎవరైనా ముందుకు రావాలని.. అలాంటివారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని గతంలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత దాల్మియా భారత్ సంస్థ ఎర్రకోట పరిరక్షణకు సంబంధించిన పలు బాధ్యతలను తీసుకోవడానికి ముందుకొచ్చింది. అందుకోసం రూ.5 కోట్లను ఖర్చు పెడతామని కూడా తెలిపింది. ఈ క్రమంలో ఈ సంస్థతో భారత ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది.

ఇటీవలే కాంగ్రెస్ ఈ అంశంపై స్పందించి ఘాటుగా ట్విటర్‌లో పోస్టు పెట్టాక కేంద్రమంత్రి మహేష్ శర్మ మాట్లాడారు. "2017లో భారతదేశంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకల్లో రాష్ట్రపతి చారిత్రక కట్టడాలను దత్తత తీసుకొనే స్కీమును ప్రారంభించారు. ఆ స్కీములో భాగంగా పలు చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి.

అందులో దాల్మియా భారత్ ఒకటి. ఈ స్కీములో భాగంగా ప్రభుత్వానికి లేదా ప్రైవేటు సంస్థలకూ ఎలాంటి లాభాపేక్ష ఉండదు. ఈ సేవలు పూర్తి వాలంటరీగా చేస్తున్నవి మాత్రమే" అని తెలిపారు. దాల్మియా భారత్ ఎర్రకోటలో వసతులకు సంబంధించి పలు చిన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో టేకప్ చేసింది. అందులో భాగంగా ఎర్రకోట సందర్శించడానికి వచ్చే యాత్రికులకు మంచి నీటి సదుపాయాన్ని కల్పించడంతో పాటు వస్తువులు పెట్టుకోవడానికి క్లాక్ రూమ్ కూడా నిర్మించింది. సర్వైలెన్స్‌కు సంబంధించిన సాంకేతిక సేవలు కూడా అందిస్తూ.. యాత్రికుల కోసం క్యాఫటేరియా, ఫ్రీ వైఫై సేవలు కూడా అందిస్తోంది. 

Trending News