Tenant War:అతనో రిటైర్డ్ ఉద్యోగి. అపార్ట్ మెంట్ లో ఆయనకు సొంత ఫ్లాట్ ఉంది. కాని తన సొంత ఇంట్లో నివాసం ఉండటానికి వెళ్లిన అతనికి చుక్కలు కనిపించాయి. ఆ ఇంట్లో అద్దెకు ఉన్న యువతి ఖాళీ చేయకపోవడంతో వారం రోజుల పాటు పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ వారం రోజులు ఇంటి యజమాని దంపతులు.. సొంత ఇంటి మెట్లపైనే ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే గ్రేటర్ నోయిడాకు చెందిన సునీల్ కుమార్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పనిచేశారు. కొద్ది కాలం క్రితం పదవి విరమణ చేశారు. సునీల్ కుమార్ కునోయిడాలోని సెక్టార్ 16బీ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో సొంత ఫ్లాట్ ఉంది. అయితే ఇల్లు ఢిల్లీలో ఉండగా.. ఆయన డ్యూటీ మాత్రం ముంబైలో నిర్వహించారు. దీంతో ఇంటిని ఖాళీగా ఉంచడం ఎందుకని గతేడాది జులైలో ప్రీతి అనే యువతికి అద్దెకిచ్చారు. 11 నెలల పాటు అద్దెకుండేలా ఇద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఈ ఏడాది జూన్ 10వ తేదీలో ఆ ఒప్పందం ముగిసింది.
ఈ ఏడాది మార్చిలో రిటైర్ అయ్యారు సునీల్ కుమార్. ముంబై నుంచి తన సొంతింటికి వస్తున్నట్లు ఏప్రిల్‌లోనే ప్రీతికి తెలిపాడు. అగ్రిమెంట్ పూర్తయ్యాక ఇల్లు ఖాళీ చేస్తే తాము తమ ఇంటికి వచ్చేస్తామని తెలిపారు. ఇందుకు ప్రీతి కూడా సరే అంది. రెండు నెలల క్రితమే గ్రేటర్ నోయిడా వచ్చిన సునీల్ దంపతులు.. ఇంటి అగ్రిమెంట్ పూర్తయ్యేవరకు బంధువుల ఇంట్లో ఉన్నారు. అగ్రిమెంట్ టైమ్ పూర్తి కావడంతో తను తన సొంత ఇంటిలో ఉండేందుకు గ్రేటర్ నోయిడాలోని ఫ్లాట్ కు వచ్చాడు. అయితే సొంత ఇంటికి వచ్చిన సునీల్ కుమార్ కు షాక్ తగిలింది. ఇంట్లో అద్దెకు ఉంటున్న యువతి ఫ్లాట్ ఖాళీ చేసేందుకు నిరాకరించింది. తాము లగేజీతో వచ్చామని చెప్పినా ఆ యువతి పట్టించుకోలేదు. దీంతో ఆ దంపతులు పోరాటం చేయాల్సి వచ్చింది.
తమ తమ సొంత ఫ్లాట్ బయటే వారం రోజులు మెట్లపై ఉన్నారు సునీల్ కుమార్ దంపతులు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఇది సివిల్ కేసు అయినందున కోర్టుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో సునీల్ దంపతులు కోర్టుకు వెళ్లారు. న్యాయపోరాటం చేస్తూనే వారం రోజులు మెట్లపైనే ఉన్నారు. ఈ విషయం కాస్తా స్థానిక మీడియాలో రావడంతో స్థానిక అధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు, స్థానికుల జోక్యంతో అద్దెకున్న యువతి ప్రీతీ ఇల్లు ఖాళీ చేసింది. దీంతో వారం రోజుల తర్వాత గురువారం రాత్రి సునీల్ దంపతులు తమ సొంత ఫ్లాట్ లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ దంపతులు ఉద్వేగానికి లోనయ్యారు.
कितनी बदनाशीबी है हमारी खुद का घर स्काई गार्डेन T-5 F-1505 होते हुए भी हम अपने घर मे सेवानिवृत होने के बाद एक गुंडा प्रवृत्त की टेनंट प्रीति गुप्ता की वजह से नही एंटर कर पा रहे है@dmgbnagar @noidapolice @nefowaoffice @abhishek_nefowa @SGrenowest @GreaterNoidaW @coprajaneesh pic.twitter.com/kYVb20PwDW
— Rakhi gupta (@Rakhigupta75) July 25, 2022
Also Read: అదంతా కనబడుతుందని.. అనన్య పాండే కాళ్లపై విజయ్ దేవరకొండ చేతులేసి మరీ..!
Also Read: Samantha: చైతూతో కలిసి ఉన్న ఇంటిని వదలని సమంత.. భారీ ధర పెట్టి మళ్లీ కొనుగోలు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook